Krithi Shetty: కృతి శెట్టికి స్టార్ హీరో కొడుకు టార్చర్.. ఎన్ని కోట్లైనా ఇస్తా వస్తావా అంటూ..!
ఉప్పెన సినిమాతో కృతి శెట్టి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. రావడం రావడంతోనే... ఓ బంపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత వరుస ఆఫర్లు ఆమెకు క్యూ కట్టాయి. అయితే పాపం ఈ భామకు కలిసిరాలేదు. వరుసగా ఆమె చేసిన సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి. అయితే ఈ ముద్దుగుమ్మను ఓ స్టార్ హీరో కొడుకు టార్చర్ పెడుతున్నాడట. ఎన్ని కోట్లు అయినా ఇస్తా వస్తావా అంటూ వేధిస్తున్నాడట. ఆ వివరాల్లోకి వెళితే...

మొదటి సినిమానే బంపర్ హిట్: బుచ్చిబాబు సన దర్శకత్వంలో పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కిన సినిమా ఉప్పెన. ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టి నటించి... ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 100కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక మొదటి సినిమానే కృతికి మంచి పేరుని తీసుకువచ్చింది. దానికి తోడు ఆమె అందం, అభినయం మరిన్నీ అవకాశాలను తీసుకు వచ్చింది.

అన్ని సినిమాలు బోల్తా...: ఇక తనే నెక్ట్స్ స్టార్ హీరోయిన్ అని అంతా అనుకున్నారు. అనుకున్నట్లు ఈ భామకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. కానీ అవి బాక్స్ ఆఫీస్ వద్ద నిలదొక్కుకోలేకపోయాయి. ఉప్పెన సినిమా తర్వాత శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ఈ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పర్వాలేదనిపించాయి. ఆతర్వాత నితిన్ తో మాచర్ల నియోజకవర్గం, రామ్ తో వారియర్ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.

దెబ్బేసిన శ్రీలీల:మళ్లీ నాగచైతన్యతో కస్టడీ అనే సినిమా తీస్తే.. అది కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయం పొందింది. ఇక ఈ భామ ఖాతాలో వరుసగా ఫ్లాప్స్ పడ్డాయి. ప్రస్తుతానికి ఈ భామకు తెలుగులో సినిమా అవకాశాలు లేవు. దీనికి కారణం శ్రీలీల అంటూ ఓ టాక్ వినిపిస్తుంది. శ్రీలీల, కృతి ఇద్దరూ ఒకే సారి కెరియర్ స్టార్ట్ చేశాడు. అయితే శ్రీలీల నటించిన సినిమాలు అన్ని దాదాపుగా హిట్టే. అయితే కృతికి ఆప్షన్ గా నిర్మాతలు శ్రీలీలను తీసుకుంటున్నారని టాక్. ఇక శ్రీలీల చేతిలో దాదాపు 10 సినిమాలు ఉన్నాయి.

కోలివుడ్లో పాగా వేసేందుకు...: ఇక కృతి విషయానికి వస్తే.. తెలుగులో సినిమాలు లేవు కానీ.. తమిళంలో సూర్య, కార్తి సినిమాల్లో ఛాన్స్ దక్కించుకుందని తెలుస్తోంది. టాలీవుడ్ లో కృతి మళ్లీ ఫాంలోకి రావాలంటే.. ఇప్పట్లో కొంచెం కష్టమే. అయితే కోలీవుడ్ లో కృతికి మంచి క్రేజ్ ఉంది. అక్కడి కోలీవుడ్ స్టార్ హీరోలు... కృతి డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇక అక్కడ లక్ ఎలా ఉంటుందో చూడాలి.
స్టార్ హీరో కొడుకు టార్చర్:ఇక కృతి శెట్టికి ఒక స్టార్ హీరో కొడుకు టార్చర్ చూపిస్తున్నాడని సమాచారం. ఎలాగైనా కృతి శెట్టితో స్నేహం చేయాలని వేధిస్తున్నాడట. ప్రతి ఈవెంటుకు తన వెంట తిరుగుతూ ఇబ్బంది పెడుతున్నాడని తెలుస్తోంది. ఇటీవల షూటింగ్ మానుకొని తన బర్త్ డే పార్టీకి రావాలని ఎన్ని కోట్లు అయినా ఇస్తా వస్తావా అంటు ఫోన్లు చేస్తూ టార్చర్ పెడుతున్నట్లు.. కృతి శెట్టి స్వయంలో ఇటీవల ఒక తమిళ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
ఎవరు ఆ హీరో ?: అయితే ఆ పార్టీకి వెళ్లడం ఇష్టం లేని కృతి శెట్టి.. తాను ఏ పార్టీలకు రానని కాల్ కట్ చేసిందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఆ స్టార్ హీరో కొడుకు ఎవరు.. ఎందుకు కృతి వెంట పడుతున్నాడు.. తమిళ్ హీరో కొడుకా.. లేదా తెలుగు హీరో కొడకా అంటూ నెటిజన్స్ చర్చించుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











