Krithi Shetty:స్టార్ హీరో కొడుకు వేధింపులు.. ఎట్టకేలకు చెప్పేసిన కృతి శెట్టి.. అమ్మో ఇంత జరిగిందా?
టాలీవుడ్ బేబమ్మ కృతి శెట్టిని వేధించేది ఎవడంటావ్? 'ఎవరా స్టార్ హీరో కొడుకు.. కృతి వెంట పడి మరీ టార్చర్ పెట్టేది', 'అసలు ఇది నిజమేనా లేదంటే అంతా పుకార్లేనా?' అనేవి ఈ మధ్య ఎక్కువగా మాటలు వినపడుతున్నాయి. అయితే వీటిన్నింటినీకి మన కృతి పాప సమాధానం చెప్పి ఓ క్లారిటీ ఇచ్చేసింది. తనను ఎవరు వేధిస్తున్నారో చెప్పేసింది. వివరాళ్లోకి వెళితే..
క్రేజీ హీరోయిన్ గా: తొలి చిత్రంతో లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ 'ఉప్పెన'తో యూత్ కు క్రష్ గా మారిపోయిన యంగ్ క్యూట్ బ్యూటీ కృతి శెట్టి. ఈ చిత్రం తర్వాత క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. అలా వరుసగా శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు, మాచర్ల నియోజకవర్గం చిత్రాల్లో మెరిసింది. కానీ అవి ఆడలేదు. ఆ తర్వాత బంగార్రాజుతో మళ్లీ మోస్తరు హిట్ అందుకుని వరుసగా సినిమాలు చేసింది.

గ్లామర్ డోస్ పెంచి మరీ: సుధీర్ బాబుతో కలిసి ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, రామ్ పోతినేనితో కలిసి ది వారియర్, రీసెంట్ గా నాగచైతన్యతో కస్టడీ చిత్రాలు చేసింది. అవి కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అయినా కూడా ఏమాత్రం తగ్గకుండా మెల్ల మెల్లగా గ్లామర్ డోస్ పెంచి అవకాశాలను పట్టుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తూ వస్తోంది.

స్టార్ హీరో కొడుకు వేధింపులు: అయితే ఈ క్రమంలోనే ఈ భామ గురించి ఓ వార్త గుప్పుమంది. ఓ స్టార్ హీరో కొడుకు ఆమెను గత కొంత కాలంగా వేధిస్తున్నాడని ఓ వార్త నెట్టింట హల్ చల్ చేసింది. కృతి ఎక్కడికి వెళ్లిన.. అతడు ఆమెను ఇబ్బందికి గురి చేస్తున్నాడని, ఈ విషయాన్ని స్వయంగా కృతినే చెప్పినట్లు ప్రచారం సాగింది. దీంతో అందరూ నిజమే అనుకున్నారు.
స్పందించిన కృతిశెట్టి: తాజాగా ఈ వార్తలు శృతిమించడంతో.. సోషల్ మీడియా ద్వారా ఈ విషయంపై స్పందించింది కృతి. ఇది అనవసరమైన నిరాధార వార్త అని నేను అంతగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అది దాని హద్దులు దాటి ప్రచారం సాగుతోంది. ఇలాంటి వాటిని అసలు నమ్మకండిఅంటూ తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చింది. ఇక ఈ పోస్ట్ తో అవన్నీ ఉట్టి రూమర్స్ అని తేలిపోయింది.

ఆ రెండు ఇండస్ట్రీలోకి ఎంట్రీ: ఇకపోతే ది వారియర్ తో తమిళ ఆడియెన్స్ ను పలకరించిన ఈ భామ.. ఇప్పుడు స్ట్రెట్ చిత్రంతో కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. అక్కడి స్టార్ హీరో జయం రవితో కలిసి జీని అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. పాన్ ఇండియా చిత్రంగా ఇది తెరకెక్కుతోంది. ఇక మలయాళ ఇండస్ట్రీలోకి కూడా ఎంట్రీ ఇవ్వనుంది. టోవినో థామస్ హీరోగా తెరకెక్కుతున్న అజాయంతే ర్యాండమ్ మోక్షణం సినిమాలో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











