Balakrishna: బాలయ్యకే నో చెప్పిన యంగ్ హీరోయిన్... ఇలా చేసిందేంటి భయ్యా?
బాలయ్య బాబు క్రేజ్ మామూలుగా ఉండదు. బాలయ్య ఈ మధ్య కాలంలో ఫుల్ జోష్ లో ఉన్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం భగవంత్ కేసరి సినిమా. ఇది రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే... ఆయన సినిమాలో ఛాన్స్ వస్తే.. నటించకుండా ఉంటారా.. ఏ హీరోయిన్ అయినా యస్ చెప్పాల్సిందే. అయితే ఓ కుర్ర హీరోయిన్ బాలయ్య సినిమాకు నో చెప్పారట. ఆ హీరోయిన్ ఎవరూ.. ఏంటి అనే వివరాలు తెలుసుకుందాం.
నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన నటిస్తున్న తాజా చిత్రం భగవంత్ కేసరి. ఇక ఈ సినిమాకు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా... కూతురి పాత్రలో శ్రీలీల నటిస్తోంది. ఇక ఈ మూవీకి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ మూవీ అక్టోబర్ 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

బాలయ్యకు ఎంత కోపమో... అంత కంటే ఎక్కువ ప్రేమగా ఉంటారు. అయితే బాలయ్యకు ఓ యంగ్ బ్యూటీ కోపం తెప్పించిందట. దానికి కారణం.. బాలయ్య ఆఫర్ ను ఆ బ్యూటీ తిరస్కరించిందని తెలుస్తోంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు.. ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన కృతిశెట్టి. మరి బాలయ్యకు రెండు సార్లు నో చెప్పి.. ఆయన ఆగ్రహానికి గురైందట.

ఇప్పటికే మనం బాలయ్య కోపాన్ని ఎన్నో సార్లు తెరపై చూశాం. ఆయన కోప్పాడిన సందర్భాలు ఉన్నాయి, కొట్టిన సందర్భాలు ఉన్నాయి. అయితే కృతి శెట్టి కూడా బాలయ్యకు నో చెప్పి.. ఆయనకుకోపం తెప్పిందని తెలుస్తోంది. బాలయ్యతో నటించే ఛాన్స్ వస్తే ఏ హీరోయిన్ వదులుకోదు.. అయితే కృతి శెట్టి వదులుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

మొదటగా కృతిశెట్టికి భగవంత్ కేసరి సినిమాలో ఆఫర్ వచ్చిందట... శ్రీలీల పాత్రకు మొదట కృతిశెట్టిని అనుకున్నారట. దానికి ఎందుకు నో చెప్పిందో తెలియదు కానీ తాజాగా బాబీ సినిమాలో కూడా కృతిశెట్టిని బాలయ్య ఆఫర్ చేస్తే మళ్లీ నో చెప్పిందంట. బాలయ్య-బాబీ సినిమాలో కూడా కృటిశెట్టికి స్పెషల్ క్యారెక్టర్ ఆఫర్ చేశారట డైరెక్టర్. బాలయ్యకు సిస్టర్ పాత్ర కోసం సంప్రదించారట అయ్యారట మేకర్స్.
అయితే కృతిశెట్టి నో చెప్పినట్లు తెలుస్తోంది. ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక బాలయ్య విషయానికి వస్తే.. భగవంత్ కేసరి సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సినిమా తర్వత ఆయన బాబీతో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా నెక్ట్స్ లెవెల్ ఉంటుందని అంటున్నారు. ఆ తర్వాత పాన్ ఇండియా సినిమాను ప్రశాంత్ వర్మతో చేయనున్నట్లు టాక్ నడుస్తోంది.


Click it and Unblock the Notifications











