రవితేజ సరసన హీరోయిన్ ఖరారు, త్వరలో సినిమా మొదలు!
మీడియాలో గత కొద్దీ రోజులుగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రవి తేజ ఓ సినిమా చేయనున్నాడని వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ నటించాల్సిన ఫ్లేస్ లో రవితేజ నటిస్తున్నాడు. వచ్చే నెల నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతున్నట్లు సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించబోతోంది.
Recommended Video

రవితేజ నటించిన తాజా సినిమా 'నేల టిక్కెట్టు' షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ మూవీ మే-24న ప్రేక్షకుల ముందుకు రానుంది. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మాళవిక శర్మ హీరోయిన్ గా నటించింది.

రవితేజ శ్రీను వైట్ల సినిమా ఇటీవల ప్రారంభం అయ్యింది. ఈ సినిమాలో అను ఇమ్యన్యుల్ హీరోయిన్ గా నటిస్తోంది. జూన్ నుండి ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు రవితేజ. సంతోష్ శ్రీనివాస్ సినిమాలో రవితేజ సరసన కాజల్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కాథరిన్ నటిస్తోంది.


Click it and Unblock the Notifications











