ప్రభాస్ సినిమాపై ఇన్ డైరెక్ట్ గా క్లారిటీ ఇచ్చేసిన గ్లామరస్ హీరోయిన్.. ముగ్గురిలో ఒకరు ఫిక్స్?

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నెంబర్ వన్ పాన్ ఇండియా స్టార్ హీరోగా క్రేజ్ అందుకుంటున్న విషయం తెలిసిందే. అతనితో సినిమాలు చేయాలని ఒకవైపు సీనియర్ నిర్మాతలు మరోవైపు అగ్ర దర్శకులు కూడా పవర్ఫుల్ కథలతో రెడీగా ఉన్నారు. ప్రభాస్ తో ఒక్కసారి అయినా సరే సినిమా చేయాలి అని స్టార్ హీరోయిన్స్ కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ప్రస్తుతం ప్రభాస్ కొత్త సినిమాల కోసం దర్శకనిర్మాతలు ప్రముఖ హీరోయిన్ లతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇక డార్లింగ్ తో నటించే అవకాశం వచ్చింది అంటే ఏమాత్రం వదులుకోవద్దు అని కొంతమంది బ్యూటీలు రెడీగా ఉన్నారు. కొందరైతే ఏకంగా ప్రభాస్ కు దగ్గరగా ఉండే దర్శకనిర్మాతలు కూడా సంప్రదిస్తున్నట్లు సమాచారం.

ప్రభాస్ సినిమాలో కనీసం చిన్న పాత్రలో అయినా లేదంటే స్పెషల్ సాంగ్ లో అయినా కనిపించే అవకాశం కల్పించాలని కూడా ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక హీరోయిన్ విషయంలో అయితే ప్రభాస్ పెద్దగా జోక్యం చేసుకోవడం అని అందరికీ తెలిసిన విషయమే. నటీనటుల విషయంలో ప్రభాస్ పూర్తిగా దర్శకులకే ఆ నిర్ణయాలను వదిలేస్తాడు. ఇక ప్రభాస్ తో సినిమా చేయడానికి ఆల్మోస్ట్ ఒక కొత్త హీరోయిన్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. ఆమె మరెవరో కాదు క్యూట్ హీరోయిన్ గా ప్రస్తుతం తమిళంలో సినిమాలు చేస్తున్న మాళవిక మోహన్. గత ఏడాది కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో మాస్టర్ అనే సినిమా చేసింది.

Heroine Malavika mohanan about prabhas project offer

ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ బ్యూటీ కే ప్రస్తుతం బాలీవుడ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఆఫర్లు అయితే గట్టిగానే వస్తున్నాయి. అయితే ఈ బ్యూటీ మాత్రం కొంచెం కూడా తొందర పడకుండా కేవలం తనకు నచ్చిన పాత్రలు మాత్రమే సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రభాస్ లాంటి హీరోలతో అవకాశాలు వస్తే మాత్రం కొంచెం కూడా ఆలోచించకుండా ఆ ప్రాజెక్టులను వదులుకోవద్దని కూడా ఆలోచిస్తోంది. కెరీర్ మొదట్లో కాస్త చిన్న సినిమాలలో నటించిన మాళవిక మోహన్ ఆ తర్వాత 2018 నుంచి అగ్ర హీరోలతో సినిమాలు చేసేందుకు ప్రయత్నం చేస్తోంది.

ఇదివరకే ఈ బ్యూటీ కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ పేట సినిమా లో నటించింది. ఆ తరువాత విజయ్ హీరోగా చేసిన మాస్టర్ సినిమాలో కూడా మంచి పాత్రలో కనిపించింది. సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా అప్పుడప్పుడు హాట్ ఫోటోలతో కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తోంది. అయితే ఇటీవల ఈ బ్యూటీ ప్రభాస్ మారుతితో చేయబోయే ఒక ప్రాజెక్టు లో నటించే అవకాశం వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో త్వరలోనే బిగ్ టాలీవుడ్ సినిమాలో నటించబోతున్నట్లు అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చింది.

ఒక విధంగా అది ప్రభాస్ సినిమా అనే తెలుస్తోంది. ఎందుకంటే ప్రభాస్ రాబోయే సినిమా కోసం మారుతి ముగ్గురు హీరోయిన్స్ ను అందుకుంటున్నట్లు టాక్ వచ్చింది. అందులో ఒక హీరోయిన్ గా మాళవికా మోహనన్ అయితే కరెక్ట్ అనే దర్శకుడు మారుతి ఆలోచించినట్లు సమాచారం. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X