దర్శక నిర్మాతలకు హీరోయిన్ 'మమ్మీ' టార్చర్.. గోల్డెన్ లెగ్ అని వెంటపడితే చుక్కలు చూపిస్తోందట!
టాలీవుడ్ సహా ఏదైనా సినీ పరిశ్రమలో ఒక హీరోయిన్ మొదటి సినిమాతో హిట్ కొడితే కనుక ఆమెకు వరుస అవకాశాలు వెల్లువలా వచ్చి పడుతుంటాయి. అయితే మొదటి సినిమా అవకాశం అంటే ఆమె వయస్సు తక్కువగా ఉంటుంది కాబట్టి హీరోయిన్ వెనుక ఆమె తల్లి కూడా సినిమా షూటింగ్ మొదలు అన్ని కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటుంది. అలా తాజాగా ఒక హీరోయిన్ తల్లి ఇప్పుడు మన దర్శక నిర్మాతలకు టార్చర్ గా మారిందని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే

చిన్నవయసులోనే
తెలుగు సినీ పరిశ్రమలో దర్శకనిర్మాతలు ఎక్కువగా ముహూర్తాలను సెంటిమెంట్లను నమ్ముతుంటారు. అదీకాక కాంబినేషన్లు, గోల్డెన్లెగ్ వంటి విషయాలను కూడా వారు ఎక్కువగా పాటిస్తూ ఉంటారు. అందులో భాగంగా హీరోయిన్లు కనుక మొదటి రెండు మూడు సినిమాలు హిట్ అయితే వారి గురించి పెద్ద ఎత్తున నిర్మాతలు క్యూ కట్టే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. అలాగే తెలుగులో ఒక సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి చిన్నవయసులోనే సూపర్ హిట్ అందుకుంది ఒక భామ.

చాలా సింపుల్ గా
ప్రస్తుతం మీడియం బడ్జెట్ హీరోలకు ఆమె బంపర్ ఆఫర్ లా కనిపిస్తోంది. మీడియం రేంజ్ ఉన్న అన్ని హీరోలకు ఆమె మొదటి ఛాయిస్ గా కనిపిస్తోంది. ఆమె గత సినిమాలు సూపర్ హిట్ కావడమే కాక ప్రస్తుతం ఒప్పుకున్న సినిమాల లిస్టు కూడా పెద్దగా ఉంది. ఈ భామ చాలా సింపుల్ గా ఉంటూ దర్శక నిర్మాతలతో తోటి నటీనటులతో అందరితో చాలా ఫ్రెండ్లీగా కనిపిస్తూ ఉంటే సదరు హీరోయిన్ తల్లి మాత్రం దర్శకనిర్మాతలకు తలనొప్పిగా మారింది.

కుమార్తె వెంటే
ప్రతి విషయంలోనూ హీరోయిన్ వెంటే ఉంటున్న సదరు హీరోయిన్ తల్లి, తన కుమార్తె కంటే తనను ఎక్కువగా కేరింగ్ చేయాలి అని అంటూ సినిమా యూనిట్ సభ్యుల మీద రుబాబు చెలాయిస్తోందట. ఆమె షూటింగ్, డబ్బింగ్ సహా ప్రతి వ్యవహారంలో కూడా కుమార్తె వెంటే ఉంటుంది. లొకేషన్ కి కూడా వచ్చి హీరోయిన్ మీద పెట్టిన శ్రద్ధ కంటే తనను బాగా చూసుకోవాలి అంటూ యూనిట్ కి హుకుం జారీ చేస్తోందట.

డిమాండ్ల చిట్టా
నిజానికి సినిమా నిర్మాతలకు ఇది చాలా మామూలు విషయం ఎందుకంటే గతంలో ఇలాంటి హీరోయిన్ తల్లులు చాలా మంది ఉన్నారు. అయితే ఈవిడ మాత్రం ప్రమోషన్ విషయంలో కూడా దర్శకనిర్మాతలకు తల నొప్పిగా మారుతుంది అని తెలుస్తోంది. అన్ని విషయాలు తనకు చెప్పే చేయాలి అని, తన కుమార్తె బయటకు అడుగు పెట్టాలి అంటే తన డిమాండ్ల చిట్టా అన్ని నెరవేరిస్తే కానీ కుదరదని ఆమె తెగేసి చెబుతోంది అట. ప్రమోషన్స్ లో సైతం హీరోయిన్ ఏం మాట్లాడాలి? ఎవరితో మాట్లాడాలి అనే విషయాలను సదరు తల్లిగారి నిర్ణయించాలట.

చాలా పవర్ఫుల్ అని
హీరోయిన్ వెనుక కుర్చీ ఉండేలా ప్లాన్ చేసుకొని ప్రతి చిన్న విషయాన్ని కూడా హీరోయిన్ తో చర్చలు జరుపుతూ ఆ తర్వాత హీరోయిన్ తో మాట్లాడిస్తున్నారట. సదరు నటి హీరోలతో ఉన్నప్పుడు కూడా ఏదో ఒక కారణంతో వారి వద్దకు వచ్చి కావాలనే ఆవిడ అడ్డుపడుతోంది అని తెలుస్తోంది. సాధారణంగా మన హీరోలు అందరికంటే మేము చాలా పవర్ఫుల్ అని ఫీల్ అవుతూ ఉంటారు అలాంటి వారికి ఈ హీరోయిన్ తల్లి ప్రవర్తన ఏ మాత్రం నచ్చడం లేదని తెలుస్తోంది.

కరోనా బారిన
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇటీవల సినిమా ప్రమోషన్ సమయంలో తల్లి కూతురు ఇద్దరూ కూడా కరోనా బారిన పడడంతో ప్రమోషన్స్ అప్పటికప్పుడు నిలిపివేసి వారు ఐసోలేషన్ లోకి వెళ్ళిపోయారు. అయితే హీరోయిన్ కి ప్రస్తుతం అవకాశాలు బాగానే వస్తున్నాయి కాబట్టి ఈ మమ్మీ గారు ఎన్ని చేసినా నడుస్తాయి. కొత్త భామల ఎంట్రీ గనుక జరిగితే ఈ భామను కూడా పక్కన పెట్టడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలలో చర్చ జరుగుతోంది. చూడాలి మరి ఏం జరగబోతుంది అనేది.


Click it and Unblock the Notifications











