అనిల్ రావిపూడి మెగాస్టార్ కు షాకిచ్చిన నయనతార.. దీపికా పదుకొణె తర్వాత నయన్ డిమాండ్
సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ లో కొన్నెళ్ల పాటు స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ప్రస్తుతం భారీ చిత్రాల్లో, ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్, కాంబినేషన్ లో నటిస్తోంది. ఈ క్రమంలో నయనతార మెగాస్టార్ చిరంజీవి సరసన తొలిసారి నటిస్తుండటం టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ తో చక్కర్లు కొడుతోంది. తన రెమ్యునరేషన్ విషయంలో నయనతార మార్పులు చేసిందని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..
మెగా 157 షూటింగ్ వివరాలు..
మెగా స్టార్ చిరంజీవి 157వ చిత్రంపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు కారణం సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటం విశేషం. ఇప్పటికే అనిల్ రావిపూడి విక్టరీ వెంకటేశ్ కాంబినేషన్ లో వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రంతో భారీ బ్లాక్ బాస్టర్ అందుకున్నాడు. ఇక చిరు అనిల్ ప్రాజెక్ట్ పైనా భారీ హైప్ నెలకొంది. 2025 మార్చి 3న గ్రాండ్ గా షూటింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ సాగుతోంది. పైగా నయనతార కూడా సెట్స్ లో జాయిన్ అయ్యింది. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లలో సాహు గరపాటి, సుష్మితా కొణిదెల నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.

నయనతార పారితోషికం..
లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ చిత్రానికి హీరోయిన్ గా ఎంపికైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రెగ్యులర్ గా షూటింగ్ కు హాజరవుతోంది. ప్రస్తుతం సినిమాకు రూ.10 కోట్లు ఛార్జ్ చేస్తున్న నయనతార మెగా 157కి ఎన్ని కోట్లు తీసుకుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే మెగా157కి నయనతార అదనపు పారితోషికం కూడా అడిగిందంట. సినిమా షూటింగ్ వరకు ఒక రెమ్యునరేషన్ తీసుకుంటుండటంతో పాటు మూవీ ప్రమోషన్స్, ఈవెంట్స్, ఆడియో లాంచ్ ఈవెంట్లకు హాజరు కావాలంటే ఎక్ట్స్రా రెమ్యునరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేసిందంట. అందుకు మేకర్స్ కూడా ఒప్పుకున్నారని తెలుస్తోంది.
మెగా 157 షూటింగ్ వివరాలు..
మెగాస్టార్ చిరంజీవి - అనిల్ రావిపూడి కాంబినేషన్ లోని మెగా 157 చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ చిత్రం 2వ షెడ్యూల్ పూర్తైంది. ఈ షెడ్యూల్ ను ముస్సోరీ లో పూర్తి చేశారు. చిరంజీవి పెర్ఫామెన్స్ అదిరిపోయిందని, హై ఎనర్జీ సీన్లను, కీలక సీన్లను పూర్తి చేశారని టీమ్ తెలియజేసింది. త్వరలో ఈ చిత్రం 3వ షెడ్యూల్ స్టార్ట్ కాబోతోంది. ఇక ఈ చిత్రం 2026 సంక్రాంతి పండుగకు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.
నయనతార రాబోయే చిత్రాలు..
లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. అరడజన్ కు పైగా చిత్రాల్లో నటిస్తూ ఉంది. తెలుగులో మెగా 157, కన్నడలో టాక్సిక్, తమిళంలో మన్నంగట్టి సిన్స్ 1960, ముక్తి అమ్మన్ 2, హి, రక్కాయి, మలయాళంలో ఎంఎంఎంఎన్, డియర్ స్టూడెంట్ వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. చివరిగా నయనతార, టెస్ట్ అనే చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. ఇక మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' చిత్రంతోనూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.


Click it and Unblock the Notifications











