స్కూల్లోనే ప్రేమ.. కాలేజ్‌లో మరో డేటింగ్.. ఇస్మార్ట్ హీరోయిన్ బ్రేకప్ కథలు!
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి క్రేజ్ అందుకున్న బ్యూటీ నిధి అగర్వాల్. మొదట నాగ చైతన్య సవ్యసాచి సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్ గా క్లిక్కవ్వడానికి ప్రయత్నాలు గట్టిగానే చేస్తోంది. అయితే ఎందుకో గాని ఇంకా సరైన రేంజ్ లో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్స్ కి పోటీ ఇవ్వడం లేదు. ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో నిధి తన ప్రేమ కథల గురించి చెప్పింది.

ముంబై నుంచే మొదలుపెట్టింది..
ఫ్యాషన్ వరల్డ్ ఒక మోడల్ గా మంచి క్రేజ్ అందుకున్న నిధి పుట్టింది హైదరాబాద్ లోనే అయినా ముంబై నుంచి తన కెరీర్ ని స్టార్ట్ చేసింది. మొదట బాలీవుడ్ లో అవకాశాలు అందుకోవాలని చాలా ప్రయత్నాలు చేసింది. టైగర్ ష్రాఫ్ మున్నా మైకేల్ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసినప్పటికి ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో అమ్మడికి అవకాశాలు రాలేదు.

తెలుగులో సక్సెస్ వచ్చినా..
ఇక తెలుగులో అక్కినేని బ్రదర్స్ తో వరుసగా సవ్యసాచి, మిస్టర్ మజ్ను అంటూ డిఫరెంట్ సినిమాలు చేసినప్పటికీ వర్కౌట్ కాలేదు. ఫైనల్ గా ఇస్మార్ట్ శంకర్ సినిమాతో అమ్మడికి సాలీడ్ బాక్సాఫీస్ హిట్టు దక్కింది. అయితే అందులో నిధి కంటే ఎక్కువగా మరో హీరోయిన్ నభా నటేష్ క్లిక్కయ్యింది.

నాలుగవ తరగతిలోనే ప్రేమ..
అసలు మ్యాటర్ లోకి వస్తే.. ఇటీవల నిధి అగర్వాల్ తన నిజజీవితంలో జరిగిన కొన్ని ప్రేమల గురించి.. డేటింగ్స్ గురించి వివరణ ఇచ్చింది. స్కూల్ లో ఉండగా నాలుగవ తరగతిలోనే మొదటిసారి ఒక అబ్బాయితో ప్రేమలో పడిందట ఈ బ్యూటీ. అలా మొదటి ప్రేమ అనుభూతిని రుచి చూసిన నిధి ఎక్కువ కాలం తన ప్రేమలను కొనసాగించలేకపోయిందట.

హార్ట్ బ్రేక్ అయ్యింది..
ఇక కాలేజ్ లో ఉండగా కొన్నాళ్లకు ఒక అబ్బాయితో డేటింగ్ కి వెళ్లినట్లు క్లియర్ గా చెప్పేసింది. ఆ వ్యక్తి నుంచి అందుకున్న లవ్ ప్రపోజల్ ని తాను మరచిపోలేనని చెబుతోంది. అనంతరం తన లవ్ గురించి పెద్దగా బయటపెట్టని ఈ అమ్మడు ప్రస్తుతం ప్రేమలో ఉందా లేదా అనే విషయాన్ని క్లారిటీగా చెప్పలేదు. అలాగే ఒకసారి తీవ్రంగా హార్ట్ బ్రేకప్ అయినట్లు కూడా చెప్పింది.
Recommended Video

హీరోల్లో నా ఫస్ట్ క్రష్..
ఇక హీరోల గురించి రకరకాల విషయాలు చెప్పిన నిధి తనకు నచ్చిన హీరో గురించి చాలానే చెప్పింది. నా ఫస్ట్ క్రష్ షారుక్ ఖాన్ అంటూ ఆయన అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పింది. ఇక భవిష్యత్తులో ప్రేమించే డ్రీమ్ బాయ్ విషయంలో తనకు ఎలాంటి కోరికలు లేవని నిధి అగర్వాల్ క్లారిటీ ఇచ్చింది. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ అశోక్ గల్లా సినిమాలో హీరోయిన్ గా నటిస్తోన్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











