'మోక్ష' లో మీరా జాస్మిన్ పాత్ర ఏంటి?
కుటుంబ కథల హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న కేరళ కుట్టి మీరాజాస్మిన్‌కి తాజాగా 'మోక్ష' అనే హర్రర్ చిత్రం చేస్తోంది. అందులో ఆమె వేంపైర్ గా కనిపించనుందని సమాచారం. ఓ ప్రెంచ్ క్లాసిక్ హర్రర్ చిత్రం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. హీరోయిన్ ఓరియెంటెడ్ హారర్ చిత్రమిది. రాజీవ్ మోహన్, దిశపాండే ఇందులో జంటగా నటించారు. శ్రీకాంత్ వేములపల్లి దర్శకత్వంలో పి.అమర్ నాథ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికి మూడు పాటలు మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది. మీరా జాస్మిన్ నటిస్తున్న తొలి థ్రిల్లర్ చిత్రమిదినీ, ఇందులో ఆమె పాత్ర ఎంతో కీలకం అనీ, గ్రాఫిక్స్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఉన్న కథ ఇది నిర్మాత చెప్తున్నారు. నాజర్, రాహుల్ దేవ్, సన, వహిదా, కాదల్ సుకుమార్, విజయ్ భాస్కర్, సుమన్ శెట్టి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వెంకట్ ఆర్.పి, సమర్పణ: శ్రీమతి పి.హిమబిందు, నిర్మాణం: అమర్ నాథన్ మూవీస్.


Click it and Unblock the Notifications











