పాపం పూజా.. అలా జరగడంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందట.. ఇప్పుడెలా
గత కొంతకాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్న పొడుగు కాళ్ల సుందరి హీరోయిన్ పూజాహెగ్డే.. ఎలాగైనా గట్టి హిట్ అందుకోవాలని బాగా ప్రయత్నిస్తోంది. అయితే అలా జరగడం వల్ల ఆమె డిప్రెషన్ లోకి వెళ్లిందని తెలిసింది. వివరాళ్లోకి వెళితే...
సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఎందుకంటే ఈ రంగుల ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. రాత్రికి రాత్రే స్టార్ సెలబ్రిటీస్ గా ఎదిగిపోవచ్చు. ఓవర్ నైట్ స్టార్ గా మారిపోవచ్చు. అదే సమయంలో
ఓ స్టార్ సెలబ్రిటీ.. కెరీర్ డౌన్ స్టేజ్ కి వచ్చేసి స్టార్ స్టేటస్ మొత్తాన్ని పోగొట్టుకోవచ్చు. ఇప్పుడు పూజ హెగ్డే పరిస్థితి కూదా అలానే ఉందని అంటున్నారు.

'ఒక లైలా కోసం' చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ పొడుగు కాళ్ల సుందరి.. ఆ తర్వాత దర్శక నిర్మాతల లక్కీ హీరోయిన్ గా మారింది. వరుసగా స్టార్ హీరోల సరసన నటిస్తూ బిజీ హీరోయిన్ గా ఎదిగింది. బాలీవుడ్ లోనూ హృతిక్ రోషన్, సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరోలతో కలిసి నటించి అభిమానులను సంపాదించుకుంది. కానీ బాలీవుడ్ లో ఆశించిన స్థాయిలో హిట్ అందుకోలేకపోయింది.
కానీ తెలుగు మాత్రం ఫుల్ జోరు ప్రదర్శించింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథంలో అందాలను ఆరబోసి మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత వరుస హిట్లను అందుకుంటూ కోలీవుడ్ లోనూ అవకాశాలను అందుకోవడం ప్రారంభించింది. అక్కడి స్టార్ హీరో విజయ్ దళపతి 'బీస్ట్' లోనూ నటించింది. అక్కడ మొదలైంది ఈమె కెరీర్ డౌన్ అవ్వడం. నిజానికి అప్పటికే ప్రభాస్ 'రాధేశ్యామ్' తో భారీ డిజాస్టర్ ను అందుకుంది. కానీ అప్పుడు ఎవ్వరూ అంతగా పట్టించుకోలేదు.

ఎప్పుడైతే 'బీస్ట్' కూడా ఫ్లాప్ అయిందో.. ఆ తర్వాత ప్రతీ చిత్రం ఆశించిన స్థాయిలో విజయాలను సాధించలేకపోయాయి. 'ఆచార్య', హిందీ చిత్రాలు 'సర్కస్', 'కిసీ కా భాయ్ కిసీ కీ జాన్' అన్ని బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచాయి. అలా గతేడాది నుంచి ఇప్పటివరకు వరుసగా ఐదు డిజాస్టర్లను అందుకంది. దీంతో దర్శక నిర్మాతలు ఆమెను కాస్త పక్కకి పెట్టారని టాక్ ఊపందుకుంది. ఎందుకంటే టాలీవుడ్ అదే సమయంలో యంగ్ బ్యూటీ శ్రీలీల జోరు బాగా పెరిగింది. ఇది కూడా పూజా కెరీర్ కు ఓ మైనస్.
రీసెంట్ గా మహేశ్ బాబు 'గుంటూరు కారం' చిత్రంలో ఈమెను తప్పించి.. శ్రీలీలను మెయిన్ హీరోయిన్ గా ఎంపిక చేశారు. అలా అన్ని అంశాలు ఆమెను బాగా బాధపెట్టాయని తెలిసింది. దీంతో ఆమె కాస్త డిప్రెషన్ లోకి వెళ్లిందట. ఎలాగైనా గట్టి సక్సెస్ కొట్టాలని ఫిక్స్ అయిందట. అయితే అంతకన్నా ముందు రిఫ్రెష్ కోసం కాస్త బ్రేక్ తీసుకోవాలని ఆశిస్తుందట. మరి ఇందులో నిజమెంతో తెలీదు గానీ బయట మాత్రం కథనాలు తెగ వచ్చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











