Priyanka Arul Mohan: పవన్ కళ్యాణ్ హీరోయిన్ కు పుట్టెడు అవకాశాలు.. పవర్ స్టార్ చేయి పడితే అంతే మరి!

న్యాచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన నాని గ్యాంగ్ లీడర్ సినిమా గురించి అందరికీ తెలిసిందే. సినిమా పెద్దగా హిట్టు కాకపోయినా అందులోని నటీనటులకు మాత్రం మంచి పేరే వచ్చింది. ముఖ్యంగా ఈ చిత్రం ద్వారానే తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టింది క్యూట్ బ్యూటీ ప్రియాంక ప్రియాంక అరుళ్ మోహన్. ఈమె అందానికి తెలుగు సినీ ప్రేక్షకుల అంతా ఫిదా అయిపోయారు. కానీ మొదటి సినిమానే ఫ్లాప్ అవడంతో ఆ అమ్మడుకు పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ ఆ తర్వాత కొంత కాలానికి శర్వానంద్ పక్కన నటించే అవకాశం దక్కింది.

శ్రీకారం చిత్రంతో శర్వానంద్ తో కలిసిన నటించిన ప్రియాంక అరుళ్ మోహన్ కు ఈ చిత్రం కూడా చేదు అనుభవాన్నే మిగిల్చింది. ఇక ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీకి వెళ్లిపోయిందీ ముద్దుగుమ్మ. అందం, అభినయం మెండుగానే ఉన్నప్పటికీ చెప్పుకోదగ్గ అవకాశాలు ఏమీ రాలేదు. కానీ తమిళంలో మాత్రం సూర్య ఈటి, డాక్టర్ - డాన్ చిత్రంలో నటించి మెప్పించింది. తన అదృష్టం కొద్ది ఈ సినిమాలు హిట్టు కావడంతో మళ్లీ టెన్షన్ పడాల్సిన అవసరం రాలేదు. రెండు చిత్రాలు హిట్టు అయిన ఊపుతోనే ధనుష్ మొదటి పాన్ ఇండియా చిత్రం కెప్టెన్ మిల్లర్ లోనూ ఛాన్స్ కొట్టేసింది.

Heroine Priyanka Arul Mohan Got Three More Telugu Movie Offers Check Details

ఇదంతా ఇలా ఉండగా.. తెలుగులో ఏకంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసనే ఛాన్సు దక్కించుకుందీ ప్రియాంక అరుళ్ మోహన్. సుజిత్ డైరెక్షన్ లో రాబోతున్న ఓజీ చిత్రంపై ఇప్పటికే పెద్ద ఎత్తున బజ్ క్రియేట్ అయింది. ఇంత పెద్ద సినిమాలో ఈ అమ్మడు ఛాన్స్ దక్కించుకున్నప్పటి నుంచి అందరి కన్ను ఈమె పైనే పడింది. అందుకే పెద్ద పెద్ద దర్శకులు, నిర్మాతలు ఈమెను సినిమాల్లోకి తీసుకోవాలని అనుకుంటున్నారు. ఇటీవలే డీవీవీ బ్యానర్ లో తెరకెక్కుతున్న సరిపోదా శనివారం సినిమాలో ఆఫర్ పట్టేసింది. నానితో ప్రియాంక అరుళ్ మోహన్ చేయబోతున్న రెండో సినిమా ఇది.

కేవలం నాని, పవన్ కల్యాణ్ సరసన మాత్రమే కాకుండా తాజాగా మరో ఛాన్స్ కొట్టేసిందీ క్యూట్ బ్యూటీ. మాస్ మహారాజా రవితేజ హీరోగా రాబోతున్న ఓ కొత్త సినిమాలో హీరోయిన్ గా ఎంపిక అయిందట ప్రియాంక అరుళ్ మోహన్. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి ముందుగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నాను హీరోయిన్ గా తీసుకోవాలనుకున్నారు. కానీ కుదరలేదు. ఇక ఆ తర్వాత కృతి శెట్టిని తీసుకుంటే బాగుంటుందని భావించారు. అది కూడా అవకపోవడంతో.. ఓజీ భామను తీసుకోవాలని డిసైడ్ చేసుకున్నారని టాక్ వస్తోంది.

Heroine Priyanka Arul Mohan Got Three More Telugu Movie Offers Check Details

అయితే ప్రియాంక అరుళ్ మోహన్ వద్దకు ఈ సినిమా ఆఫర్ వెళ్లిందని... అందుకు ఆమె కూడా ఓకే చెప్పిందని తెలుస్తోంది. కానీ ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు. త్వరలోనే ఇందుకు సంబంధించిన విషయాలను చిత్రబృందం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఈ క్యూట్ బ్యూటీ టాప్ హీరోల సరసన నటించే అవకాశం పట్టేసి ఏ రేంజ్ లో హిట్టు కొడుతుందో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X