స్టార్ హీరోయిన్ టిక్ టాక్ ఎడిక్షన్.. దానికి బానిసై వీడియోలు చేస్తూ! బ్యూటీ సీక్రెట్ రివీల్
నానాటికీ సోషల్ మీడియా ప్రభావం బాగా పెరిగిపోతోంది. స్మార్ట్ ఫోన్ యుగం రావడంతో అన్నితరాల వారు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో టిక్ టాక్, ఫేస్‌బుక్, ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాలకు ఎడిక్ట్ అయ్యేవారి సంఖ్య ఎక్కువవుతోంది. ఇదే కోవలో ఓ స్టార్ హీరోయిన్ కూడా టిక్ టాక్‌కి బాగా ఎడిక్ట్ అయిందనే సీక్రెట్ బయటకు రావడం వైరల్‌గా మారింది. ఆ వివరాలేంటో చూద్దామా..

రాశి ఖన్నా టిక్ టాక్ ఎడిక్షన్
స్టార్ హీరోయిన్ రాశి ఖన్నా టిక్ టాక్‌కి బాగా అడిక్ట్ అయిందట. అంతేకాదు కొన్ని వీడియోలు కూడా టిక్ టాక్‌లో పోస్ట్ చేస్తోందట. నిజంగానా? మేమెప్పుడూ చూడలేదే.. అనుకుంటున్నారు కదూ!. డిసెంబర్ 20వ తేదీ తర్వాత మీరే చూస్తారు.. రెడీగా ఉండండి. ఈ పాటికే అసలు విషయం అర్థమై ఉంటుంది. అదేనండీ 'ప్రతీ రోజు పండగే' టాపిక్.

మోడ్రెన్ అమ్మాయిగా దూకుడు
ఇంకా అర్థం కాలేదా? అయితే చూడండి. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ప్రతీ రోజు పండగే' సినిమాలో రాశి ఖన్నా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆమె చాలా మోడ్రెన్ అమ్మాయిగా కనిపిస్తుందట. సామాజిక మాధ్యమాలకు దగ్గరగా ఉండే పాత్రలో ఆమె నటిస్తోందట.

వీడియోలు.. పోస్టులు అన్నీ
మరీ ముఖ్యంగా టిక్ టాక్‌కి బాగా ఎడిక్ట్ అయిన యువతిగా ఆమె రోల్ కడుపుబ్బా నవ్వించనుందని తెలుస్తోంది. 'టిక్ టాక్'కి బానిసైన రాశి ఖన్నా ఎప్పుడు చూసినా వీడియోలు చేస్తూ వుంటుందట. అలా ఆమె చేసే 'టిక్ టాక్' వీడియోలు ప్రేక్షకులకు వినోదాల విందు ఇస్తాయని తెలుస్తోంది.

మెగా మేనల్లుడి జోడీగా.. మరోసారి
గతంలో సుప్రీమ్ సినిమాలో సాయి ధరమ్ తేజ్ జోడీగా నటించి కామెడీ పండించింది రాశీ ఖన్నా. బెల్లం శ్రీదేవిగా ఆమె నటన కడుపుబ్బా నవ్వించింది. మళ్ళీ ఇప్పుడు అదే కాంబోలో 'ప్రతీ రోజు పండగే' సినిమాతో గిలిగింతలు పెట్టేందుకు రెడీ అవుతోంది రాశీ.

గ్రామీణ నేపథ్యం.. మారుతి మార్క్
గ్రామీణ నేపథ్యంలో బంధాలు - అనుబంధాలు ప్రధానంగా 'ప్రతీ రోజు పండగే' సినిమా నిర్మితమవుతోంది. దీనికి తనదైన మార్క్ కామెడీ అంశాలు జోడించి తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ మారుతి. సినిమా షూటింగ్ కంటే ముందే ఈ స్క్రిప్ట్ చూసి మెగాస్టార్ చిరంజీవి ఫిదా కావడం విశేషం.

ప్రతీ రోజు పండగే మూవీ
సాయిధరమ్ తేజ్, రాశి ఖన్నా హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న ప్రతీ రోజు పండగే సినిమాలో సత్యరాజ్ కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 బ్యానర్స్‌పై రూపొందుతున్న ఈ సినిమా డిసెంబర్ 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











