Rashmika Mandanna: రష్మికతో 20 సార్లు చెంపదెబ్బలు తిన్న స్టార్ హీరో ఎవరో తెలుసా?

నేషనల్ క్రష్ అందాల భామ రష్మిక మందన్నా వరుస సినిమాలతో దూసుకుపోతుంది. టాలీవుడ్, కోలివుడ్, బాలీవుడ్ పరిశ్రమల్లో సినిమాలు చేస్తూ... ఫుల్ జోష్ మీద ఉంది ఈ బ్యూటీ. ఇటీవల యానిమల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ భామ. ఇదిలా ఉంటే రష్మిక మందన్నాతో 20 సార్లో ఓ స్టార్ హీరో చెంపదెబ్బలు తిన్నారంటూ ఓ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. ఆ హీరో ఎవరు.. ఎందుకు 20 సార్లు చెంప దెబ్బలు తిన్నారు అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కన్నడ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్నా ప్ర‌స్తుతం కెరీర్ ప‌రంగా ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతుంది. చేతి నిండా సినిమాల‌తో క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతోంది నేషనల్ క్రష్. అయితే ఇటీవ‌ల ఓ స్టార్ హీరో ర‌ష్మిక చేతిలో ఏకంగా ఇర‌వై సార్లు చెంప దెబ్బ‌లు తిన్నారని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంత‌కీ ఆ హీరో మ‌రెవ‌రో కాదు బాలీవుడ్ స్టార్ ర‌ణ‌బీర్ క‌పూర్‌ అని తెలుస్తోంది. అయితే ర‌ణ‌బీర్ ఏదో త‌ప్పు చేశాడ‌ని ర‌ష్మిక కొట్టింది అనుకుంటే పొర‌పాటే.

Heroine Rashmika Mandanna Slaps Ranbir Kapoor For 20 Times in Animal Shooting News Goes Viral

అసలు విషయం ఏంటంటే... రణబీర్ కపూర్ హీరోగా, రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించిన చిత్రం యానిమల్. ఇక ఈ సినిమా షూటింగ్ లో భాగంగా ఈ ఘటన జ‌రిగిందని తెలుస్తోంది. టాలీవుడ్ డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి వంగా తెర‌కెక్కించిన యాక్ష‌న్ డ్రామా యానిమ‌ల్‌ డిసెంబ‌ర్ 1న పాన్ ఇండియా ఇండియాలో విడుద‌లైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచి... కాసుల వ‌ర్షాన్ని కురిపించింది.

అదే స‌మ‌యంలో ఈ సినిమాపై ఎన్నో విమ‌ర్శ‌లు వ‌చ్చాయి కూడా. పార్లమెంట్ వేదికగా ఈ మూవీ కంటెంట్ పై చర్చ జరిగిందనే విషయం తెలిసిందే. కానీ, చివ‌ర‌కు విమ‌ర్శ‌లే ప్ల‌స్ అయ్యాయనే చెప్పాలి. భారీ ప్ర‌మోష‌న్ ల‌భించ‌డంతో బాక్సాఫీస్ వద్ద యానిమ‌ల్ చెల‌రేగిపోయి కలెక్షన్ల వర్షం కురిపించింది. ర‌ణ‌బీర్ కెరీర్ లోనే హైయ్యెస్ట్ క‌లెక్ష‌న్స్ ను రాబ‌ట్టిన సినిమాగా యానిమల్ చరిత్ర సృష్టించింది.

Heroine Rashmika Mandanna Slaps Ranbir Kapoor For 20 Times in Animal Shooting News Goes Viral

అయితే తాజాగా 'యానిమల్' నిర్మాత, డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి వంగా సోద‌రుడు అయిన‌ ప్రణయ్ రెడ్డి వంగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొని... ఎన్నో ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్లడించారు. ఈ క్ర‌మంలోనే హీరో ర‌ణ‌బీర్ క‌పూర్ హీరోయిన్ ర‌ష్మిక చేతిలో ఇర‌వై సార్లు చెంప దెబ్బ‌లు తిన్నాడ‌ని ఆయ‌న లీక్ చేశాడు. యానిమ‌ల్ మూవీలో కర్వా చౌత్ సీన్ చేసే సమయంలో. ర‌ణ‌బీర్ ను ర‌ష్మిక కొడుతుంది. అయితే ఆ స‌న్నివేశం ప‌ర్ఫెక్ట్ గా రావ‌డానికి దాదాపు ఇర‌వై టేకులు తీసుకున్నార‌ట‌ మేకర్స్.

అంటే ఇర‌వై సార్లు ర‌ష్మిక... ర‌ణ‌బీర్ ను కొట్టిందని తెలుస్తోంది. అయినాస‌రే ర‌ణ‌బీర్ ఏమాత్రం విసుగు చెంద‌కుండా... సీన్ లో ఎమోష‌న్ పండాలంటే ఈ మాత్రం క‌ష్ట‌ప‌డాల‌ని ర‌ణ‌బీర్ చెప్పుకొచ్చిన‌ట్లు ప్ర‌ణ‌య్ తాజాగా ఇంట‌ర్వ్యూలో చెప్పుకువచ్చాడు. ఏదేమైనా స్టార్ హోదాలో ఉండి ఒక హీరోయిన్ చేత అన్నిసార్లు కొట్టించుకోవ‌డం మామూలు విష‌యం కాద‌నే అంటున్నారు ఫ్యాన్స్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X