స్టార్ హీరో ఫామ్‌హౌస్‌లో రష్మిక మందన్న.. రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన యంగ్ బ్యూటీ!

సినిమా పరిశ్రమలో క్రేజీ కాంబినేషన్స్‌తోనే మూవీస్ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాయి. హీరో, హీరోయిన్ల కాంబినేషన్స్ కారణంగానే అభిమానుల నుంచి ఆదరణ ఉంటుంది. అలాగే భారీ ఓపెన్సింగ్ ఉంటాయనేది నిర్మాతలు, దర్శకులు అభిప్రాయం. అయితే హిందీలోనే కాకుండా అన్ని భాషల్లో కూడా ఆర్టిస్టుల కాంబినేషన్లు కీలకంగా మారుతున్నాయి. అయితే తాజాగా బాలీవుడ్ సూపర్ స్టార్ నటిస్తున్న తాజా చిత్రంలో ఓ స్టార్ హీరోయిన్‌ను సెట్ చేశారు. ప్రస్తుతం ఆ హీరోయిన్.. ఆ స్టార్ హీరో ఫామ్‌హౌస్‌లో ఉంటున్నట్టు బాలీవుడ్‌ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతున్నది. ఆ వార్తకు సంబంధించిన వివరాల్లోకి వెళితే...

బాలీవుడ్‌పై బిష్ణోయ్ లారెన్స్ హెచ్చరికల నేపథ్యంలో స్టార్ హీరో, హీరోయిన్లందరూ కొంత మేరకు అప్రమత్తమయ్యారు. సల్మాన్ ఖాన్‌ను హతమారుస్తామని వార్నింగ్ ఇవ్వడంతో ఆయన చుట్టూ భారీగా భద్రతను పెంచారు. ఆయన ఉండే పరిసర ప్రాంతాల్లో కూడా కట్టుదిట్టమైన సెక్యూరిటీని భారీగా పెంచారు. ఆయన షూటింగ్, అలాగే ఫామ్‌హౌస్‌లో గట్టిగా బందోబస్తు ఏర్పాటు చేశారు.

Heroine Rashmika Mandanna staying at Salman Khan s Panvel Farmhouse for Sikandar Cinema Shoot

ఇదిలా ఉండగా, సల్మాన్ ఖాన్ నటిస్తున్న చిత్రం సికందర్. ఈ సినిమాకు గజనీ ఫేమ్ ఏఆర్ మురగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సాజిత్ నడియావాడ నిర్మాతగా వహిస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్నది. క్రేజీ కాంబినేషన్‌తో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే సికందర్ చిత్రం షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఈ సినిమా షూటింగ్‌ను లోనావాలాలోని సల్మాన్ ఫామ్‌హౌజ్‌లో నిర్వహిస్తున్నారు. దాంతో ఈ సినిమా యూనిట్‌కు సంబంధించిన వారాంతా ఆ లోకేషన్‌లోనే ఉంటున్నారు.దాంతో ఈ సినిమా యూనిట్ కోసం ప్రత్యేకంగా సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. అత్యంత పకడ్బందీ ఏర్పాట్ల మధ్య షూటింగ్ జరుగుతుున్నది.

సికందర్ మూవీ షూటింగ్ కోసం రష్మిక మందన్న ప్రస్తుతం పన్వేల్‌లోని సల్లూభాయ్ ఫామ్ హౌస్‌లోనే ఉంటున్నారు. ఆ సినిమా ప్రిపరేషన్ కోసం అక్కడే ఉంటున్నారు. పన్వెల్‌లో ఫామ్‌హౌస్‌లో ఉంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నాయి. అయితే భద్రత దృష్టా ఆమెను అక్కడే ఉండాలని సూచించడంతో నేషనల్ క్రష్ అక్కడే మకాం పెట్టింది.

Heroine Rashmika Mandanna staying at Salman Khan s Panvel Farmhouse for Sikandar Cinema Shoot

ఇదిలా ఉంటే.. సల్మాన్ ఖాన్ ఫామ్‌హౌజ్‌కు సంబంధించిన లోపలి వాతావరణాన్ని అన్యనా పాండే సోదరుడు షేర్ చేసిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నది. ఆ క్యాంపస్‌లో ఉన్న స్పోర్ట్స్ విభాగం, జంతువులు, చెట్లు, బైక్స్ కలెక్షన్ ఫోటోలు చూస్తే పెద్ద ప్రపంచమే అందులో ఉన్నట్టు అర్ధమవుతుంది. అయితే నేషనల్ క్రష్ కేవలం సినిమానే కాకుండా అక్కడి గుట్టలు, పుట్టలు, అడవితో కూడిన పరిస్థితనుల ఎంజాయ్ చేస్తూ ఉంటున్నారు అని సన్నిహితులు చెబుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X