భవిష్యత్ చెప్పనున్న రెజీనా.. హీరోయిన్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్!

టాలీవుడ్ హీరోయిన్లలో కెల్లా రెజీనాకు ప్రత్యేక స్థానం ఉంది. అందం, అభినయం రెండూ కలగలిపి ఎన్నో సినిమాల్లో తెలుగు ప్రేక్షకులను అలరించింది ఈ ముద్దుగుమ్మ. సౌత్ ఇండియన్ భాషల్లో చాలా సినిమాలు చేసిన ఈమె తెలుగులో ''అ!, 7'' లాంటి సినిమాల్లో డిఫెరెంట్ క్యారెక్టర్ చేసి ప్రేక్షకుల మన్ననలు పొందింది.

జయాపజయాల సంగతి అటుంచితే, పాత్రకి న్యాయం చేస్తూ నటన పరంగా మంచి మార్కులు కొట్టేస్తోంది రెజీనా. ఈ మధ్యకాలంలో వచ్చిన 'ఎవరు' సినిమా ఆమెకి మంచి పేరు తెచ్చిపెట్టింది. కాగా ప్రస్తుతం ఆమె తమిళంలో ఓ సినిమా చేయడానికి సిద్ధమవుతోంది. జనవరి రెండో వారంలో ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది.

 Heroine Regina Cassandra Intresting Update

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాగా రాబోతున్న ఈ చిత్రానికి కార్తీక్ రాజు దర్శకత్వం వహించనున్నాడు. ఇందులో రెజీనా క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉండనుందని సమాచారం. భవిష్యత్తులో ఏం జరుగుతుందో లెక్క తప్పకుండా జోష్యం చెప్పే పాత్రలో రెజీనా కనిపిస్తుందని అంటున్నారు. ఎంతో విలక్షణమైన ఈ పాత్ర ద్వారా కెరీర్‌లో ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకోవాలని రెజీనా భావిస్తున్నట్లు టాక్.

మరోవైపు తెలుగులో చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందనున్న కొత్త సినిమాలో రెజీనాకు ఛాన్స్ వచ్చిందని తెలుస్తోంది. ఈ సినిమాలో రెజీనాతో ఐటెం సాంగ్ చేయించాలని చిత్ర యూనిట్ భావిస్తోందట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X