డైరక్టర్ ని ఆడిపోసుకుంటున్న 'ప్రస్దానం' హీరోయిన్?
దర్శకుడు తనను సరిగా చూపలేదని, సినిమా మొత్తంపై ఒక్క సింగిల్ క్లోజ్ షాట్ కూడా తనపై వెయ్యలేదని ప్రస్ధానం హీరోయిన్ రూబీ దర్శకుడుని తిట్టుకుంటోందని ఫిల్మ్ నగర్ లో వినపడుతోంది. రొమాంటిక్ ధ్రెడ్ కి పెద్దగా ప్రయారిటీ ఇవ్వక పోవటం, హీరోయిన్ ని గ్లామర్ గా చూపటం పోవటం ఆమెను చాలా భాధించాయని అంటున్నారు. అలాగే చిత్రం ప్రారంభం ముందు దరిదాపు నెల రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చారని అదంతా బూడిదలో పోసినట్లే అయిందని భాదపడుతోందట. ఇక షూటింగ్ సమయంలో తనపై చాలా సన్నివేసాలు తీసారని లెంగ్త్ ని దృష్టిలో పెట్టుకునో మరెందుకో ఎడిట్ చేసారని ఆమె వాపోతోంది. అలాగే సెకెండాఫ్ లో ఆమెతో వచ్చే డ్యూయిట్ కూడా కత్తిరించనున్నారని వార్త. దాంతో ఆమె తనూ ఈ చిత్రం చేసానని చెప్పుకుని తర్వాత సినిమా ఎలా పట్టుకుంటాను అన్న వేదనలో మునిగిపోయిందని చెప్తున్నారు. ఈ మధ్యన వరుడు హీరోయిన్ భానుశ్రీ మెహతా కూడా ఇలాగే ఇబ్బందిపడిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











