Sai Pallavi: సాయి పల్లవి గుడ్ న్యూస్.. త్వరలోనే దర్శకురాలిగా.. ఏ సినిమాతో అంటే?
సాయి పల్లవి ఈ పేరుకు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మేకప్ వేసుకోదు, ఎక్స్ పోజింగ్ చేయదు, కేవలం యాక్టింగ్ స్కోప్ ఉన్న పాత్రలనే చేస్తుంది అనే ట్యాగ్‌లైన్‌ను సంపాదించుకుంది. తన నేచురల్ స్మైల్, యాక్టింగ్‌తో అందరినీ కట్టిపడేసింది. అయితే ఇన్నేళ్ల పాటు నటనలో రాణించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు కొత్త అవతారం ఎత్తబోతుందని తెలిసింది. త్వరలోనే దర్శకురాలిగా మారబోతుందట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను స్టోరీలోకి వెళ్లి తెలుసుకుందాం..
మలయాళ సినిమా ప్రేమమ్‌తో ఇండస్ట్రీకి పరిచయమైన బ్యూటీలు అనుపమ పరమేశ్వరన్, సాయిపల్లవి. తొలి చిత్రంతోనే ఇద్దరు గ్రాండ్ హిట్స్‌ను ఖాతాలో వేసుకున్నారు. ఆడియెన్స్‌కు హార్ట్ ఫుల్‌గా బాగా కనెక్ట్ అయిపోయారు. అయితే ఈ ఇద్దరిలో అనుపమ తన బోల్డ్ పెర్ఫామెన్స్‌తో కురాళ్ల మదిలో స్థానం సంపాదించుకుంటే సాయి పల్లవి మాత్రం అందుకు భిన్నంగా చేసి చిరస్థాయిలో చోటును దక్కించుకుంది. తన చిత్రాలతో, వ్యక్తిత్వంతో ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టేసింది.

సూపర్ నేచురల్ డ్యాన్సింగ్, యాక్టింగ్ టాలెంట్ ఉన్న సాయి పల్లవి ఫిదా సినిమాతో ఇక్కడి ప్రేక్షకులకు పరిచయమైంది. తెలంగాణ యాసలో తన పెర్ఫామెన్స్‌తో అదరగొట్టేసింది. అనంతరం మిడిల్ క్లాస్ అబ్బాయి, కణం, పడి పడి లేచే మనసు వంటి సినిమాలతో వరుసగా అలరిస్తూ పోయింది. తర్వాత నాగచైతన్యతో కలిసి లవ్ స్టోరీతో భారీ హిట్‌ను అందుకుంది.
ఈ క్రమంలోనే పలు తమిళ సినిమాల్లోనూ నటించి మెప్పించింది. ఆమె చేసిన దియా, మారి 2, అథిరన్, పావ కదైగల్ వంటి సినిమాలు మంచి టాక్‌నే తెచ్చుకున్నాయి. ఇంకా చెప్పాలంటే టాక్ ఎలా ఉన్నా ఆమె నటనకు ఎప్పటికప్పుడు క్రేజ్ మరింత పెరుగుతూ వచ్చింది. తెలుగులో చివరిగా నానితో శ్యామ్ సింగరాయ్, రానాతో విరాటపర్వం వంటి చిత్రాలు చేసింది. ఇందులో శ్యామ్ సింగరాయ్ బాక్సాఫీస్ దగ్గర బాగా ఆడగా, విరాట పర్వం పర్వాలేదనిపించింది. ఇక చివరిగా ఆమె లేడి ఓరియెంటెడ్ గార్గి చిత్రంతో అటు తమిళంతో ఇటు తెలుగులో మెప్పించింది.

ఇక గార్గి(2022) తర్వాత సాయి పల్లవి మళ్లీ స్క్రీన్‌పై కనిపించలేదు. కేవలం ఆధ్యాత్మిక ప్రదేశాల టూర్లకు తిరుగుతూ ప్రొఫెషనల్ లైఫ్‌కు కాస్త గ్యాప్ ఇచ్చింది. ఇక ఈ మధ్యనే ఆమె చెల్లికి కూడా ఎంగేజ్మెంట్ అయింది. ఈ హాడావుడిలోనే గడిపేసింది. ప్రస్తుతం తమిళంలో శివ కార్తికేయన్‌తో ఓ మూవీ చేస్తోంది. ఇక రీసెంట్గా రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందులో నాగచైతన్యతో కలిసి చేస్తున్న తండేల్ ఒకటి. ఇది సీ అండ్ లవ్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతోంది. త్వరలోనే హిందీలో ఆమిర్ ఖాన్ కొడుకు సినిమాతో అరంగేట్రం ఇవ్వనుంది.
అలా ఇప్పటివరకు నటనలో రాణించి సక్సెస్ అయిన సాయిపల్లవి త్వరలోనే డైరెక్టర్ అవతారం ఎత్తబోతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఆమెనే స్వయంగా ఓ ఇంటెన్స్ స్టోరీ రాస్తోందని తెలిసింది. దీనికి తానే దర్శకత్వం వహించనుందట. ఒకవేళ ఇది కనుక నిజమైతే కెరీర్లోనే సాయిపల్లవి డైరెక్ట్ చేయబోయే తొలి సినిమా ఇదే కావడం విశేషం. చూడాలి మరి ఏం జరుగుతుందో..


Click it and Unblock the Notifications











