Samantha చైతూ కన్నా ముందే అతన్ని ప్రేమించాను! - ఫస్ట్ లవ్ సీక్రెట్‌ను రివీల్ చేసిన సమంత
ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగ చైతన్యతో డివొర్స్ తీసుకున్న హీరోయిన్ సమంత జీవితంలో మరింత ఉన్నత స్థాయికి ఎదిగింది. లైఫ్‌ను మరింత ఫ్రీడమ్‌గా గడుపుతూ హ్యాపీగా ఉంటోంది. ఆ మధ్య మయోసైటిస్ రోగం బాధపెట్టినా కూడా దానికి చికిత్స తీసుకుంటూనే లైఫ్‌ను ప్రశాంతంగా గడుపుతోంది. అయితే ఈ ముద్దుగుమ్మ చైతూ కన్నా ముందుకు ఓ వ్యక్తిని ప్రేమించింది. అతడి గురించే తానే స్వయంగా చెప్పింది. ఇంతకీ అతనెవరు? ఆ లవ్ స్టోరీ కథేంటో తెలుసుకుందాం...
టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలో స్టార్ హోదాను సంపాదించుకున్న హీరోయిన్లలో సమంత ఒకరు. తన అందం, నటనతో మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఏం మాయ చేశావే చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఆమె ఆ తర్వాత బృందావనం, ఈగ, దూకుడు, మనం, అత్తారింటికి దారేది, ఓ బేబీ, యూటర్న్, యశోద, శాకుంతలం వంటి చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది. ఇక పుష్ప ఊ అంటావా మావ సాంగ్‌తో నేషనల్ వైడ్‌గా క్రేజ్ సంపాదించుకున్న ఈ భామ ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్‌తో మరింత పాపులర్ అయింది.

అయితే ఈ సినీ జర్నీ క్రమంలోనే అక్కినేని నాగ చైతన్యను పెళ్లి చేసుకుని పర్సనల్ లైఫ్‌ను కొనసాగించింది. వాస్తవానికి ఈ జంట తమ తొలి చిత్రం ఏమాయ చేశావే సమయంలోనే ప్రేమించుకుని విషయాన్ని సీక్రెట్‌గా ఉంచారు. చాలా కాలం దాచి ఆ తర్వాత ఇంట్లో చెప్పి పెద్దల సమక్షంలో గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నారు. అలా అక్కినేని వారి కోడలుగా మారింది సమంత. కానీ వీరి కాపురం మూడునాళ్ల ముచ్చటైంది. త్వరగానే విడాకులు తీసుకుని ఒంటరి జీవతాన్ని గడపడం మొదలుపెట్టారు. ఈ విషయం ఎంతోమంది అభిమానులను బాధ పెట్టింది.

అనంతరం సామ్ - చైతూ ఎవరి ప్రొఫెషనల్ లైఫ్స్లో వారు బిజీ అయిపోయారు. అయితే విడాకులు తీసుకున్నప్పటికీ వీరిద్దరి గురించి ఏదో ఒక ప్రచారం సాగుతూనే ఉంటుంది. అలా తాజాగా సామ్ ఫస్ట్ లవ్ స్టోరీ గురించి బయటకు వచ్చింది. ఈ విషయాన్ని సామ్నే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.
పల్లావరం నుంచి టీనగర్ వెళ్లడానికి రెండు బస్సులు మారాలి. రోజు వెళ్లడానికి రెండు గంటలు పడుతుంది. అయితే రెండేళ్ల పాటు ఒక అబ్బాయి నా కోసం ప్రతిరోజు బస్టాండ్‌లో వెయిట్ చేసేవారు. నా స్కూల్ వరకు వచేవ్వారు. నాకు నాలుగు ఐదు అడుగులు దూరంగా వెనకాలే వస్తారు. అస్సలు మాట్లాడారు. ఒంటరిగా వస్తారు. ఏమీ చేయరు. అయితే చివరికి నా 12 క్లాస్ స్కూల్ అయిపోయింది. అప్పుడు వెళ్లి నన్ను ఎందుకు ఫాలో అవుతున్నారని అడిగాను.. అప్పుడు నేను మిమ్మల్ని ఫాలో చేయలేదే అని చెప్పారు. అలా ఆయన అనడంతో బల్బ్ ఎగిరిపోయింది. మరి అది ప్రేమో కాదో తెలీదు. అలా నా ఫస్ట్ లవ్ స్టోరీ ముగిసిపోయింది. అని సమంత చెప్పింది.


Click it and Unblock the Notifications











