మహారాణిగా సమంత.. ఆ భారీ వెబ్ సిరీస్‌ను అలా ప్లాన్ చేస్తున్నారట!
సౌత్ ఇండియా సినిమా దగ్గర సినిమాలు సహా పలు కాంట్రవర్సీ లతో కూడా కెరీర్ ని లీడ్ చేస్తున్న టాప్ మోస్ట్ హీరోయిన్స్ లో స్టార్ బ్యూటీ సమంత కూడా ఒకరు. మరి సమంత హీరోయిన్ గానే కాకుండా నిర్మాతగా కూడా పలు సినిమాలు చేస్తుంది. అలాగే సినిమాలో హీరోయిన్ గా సహా తనపై సోలో మూవీస్ కూడా చేస్తుంది అయితే బిగ్ స్క్రీన్ వరకు ఇవి కానీ స్మాల్ స్క్రీన్ ఓటిటి పరంగా కూడా సమంత ఎంతో బిజీగా ఉంది.
కాగా సమంత ఇపుడు సినిమాలు సహా ఓటిటిలో పలు భారీ సిరీస్ లు చేస్తుండగా ఈ సిరీస్ లలో ప్రస్తుతం భారీ స్పై అండ్ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ "సిటాడెల్ హనీ బన్నీ" తో వస్తుంది. కాగా ఈ సిరీస్ లో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ నటించగా ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే లు తెరకెక్కించారు. అయితే ఇందులో సమంత స్పై గా నటిస్తుంది అని తెలిసిందే.

కానీ ఈ సిరీస్ తర్వాత సమంత చేస్తున్న మరో సెన్సేషనల్ సిరీస్ ఏదన్నా ఉంది అంటే అది ఇండియన్ సినిమా దగ్గర బెస్ట్ హారర్ అండ్ ట్రెజర్ హంట్ సినిమా "తుంబాడ్" ని తెరకెక్కించిన దర్శకుడు అనీల్ రాహి బార్వే కాంబినేషన్ లో చేస్తున్న సిరీస్ "రక్త బ్రహ్మాండ్" కూడా ఒకటి. అయితే ఈ సిరీస్ లో సమంత రోల్ చాలా బోల్డ్ గా ఉంటుంది అని టాక్ ఉంది.
అలాగే ఈమె మీర్జాపూర్ ఫేమ్ నటుడు ఆలీ ఫజల్ సరసన నటిస్తుంది అని కూడా సమాచారం ఉంది. కానీ ఇపుడు ఈమెపై మరిన్ని ఆసక్తికర అంశాలు వినిపిస్తున్నాయి. దీనితో సమంత ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో ఒక మహారాణిగా కనిపించనుందని వినిపిస్తుంది. దర్శకుడు ఈ సిరీస్ ని పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కిస్తున్నాడు అని ఆ మధ్య వార్తలు వచ్చాయి.

కాగా ఇలా సమంత ఓ రాజ్యానికి రాణిగా ఒక ఇంటెన్స్ పాత్రలో కనిపిస్తుంది అని తెలుస్తుంది. అలాగే దర్శకుడు అనీల్ ఈమె పాత్రని ఊహించని విధంగా ప్లాన్ చేసాడని ఇది ఆశ్చర్యపరిచేలా ఉంటుంది అని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి అయితే సమంత మాత్రం ఓటిటి పరంగా ఏదో పెద్దగానే కొట్టేలా ఉంది అని చెప్పాల్సిందే.
ప్రస్తుతం ఈ భారీ సిరీస్ షూటింగ్ లో ఉండగా వరల్డ్ పాపులర్ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుండగా వీరితో పాటుగా ఇపుడు సమంతతో సిటాడెల్, అలాగే ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ తీసిన దర్శకులు నిర్మాణం వహిస్తున్నారు. ఇక ఇది అటుంచితే సామ్ నటించిన సిటాడెల్ హనీ బన్నీ సిరీస్ ఈ నవంబర్ 7 నుంచి ప్రైమ్ వీడియోలో పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ కి రానుంది.


Click it and Unblock the Notifications











