త్రివిక్రమ్ కు హ్యాండ్ ఇచ్చిన యంగ్ హీరోయిన్.. రెండు రోజులకే ఆ సినిమా చేయలేనంటూ..?
కోలీవుడ్ టాలెంటెడ్ హీరో ధనుష్ కేవలం తమిళ ఇండస్ట్రీ లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా తన స్థాయిని పెంచుకునే విధంగా సినిమాలు చేస్తున్నాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అతను రెగ్యులర్ సినిమాలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగు చిత్ర పరిశ్రమలో గతంలో చాలా ఆఫర్లు వచ్చినప్పటికీ అంతగా కనెక్ట్ కాలేకపోయిన ధనుష్ ఇటీవల మాత్రం ఇద్దరు తెలుగు దర్శకులకు గ్రీన్సిగ్నల్ ఇచ్చాడు.
అయితే త్రివిక్రమ్ కు సంబంధించిన ఒక ప్రాజెక్టును ఇటీవల మొదలుపెట్టగా ధనుష్ కు చేదు అనుభవం ఎదురైనట్లు తెలుస్తోంది. ఇక ఆ సినిమా లో సెలెక్ట్ అయిన హీరోయిన్ ఊహించని విధంగా రెండు రోజులకి సినిమా నుంచి తప్పుకున్నట్లు టాక్ వస్తోంది.

ఎప్పటి నుంచో ఆ ఆలోచన
తమిళ చిత్ర పరిశ్రమలో మంచి నటుడిగా ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న ధనుష్ ఆ తర్వాత తన స్థాయిని బాలీవుడ్ హాలీవుడ్లో కూడా పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా మంచి సినిమాలు చేయాలని ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నాడు. కానీ అతనికి అప్పట్లో నచ్చిన విధంగా ఎవరు కూడా సరైన కథలు చెప్పలేకపోయారు.

సార్ షూటింగ్ స్టార్ట్..
ఇక మొత్తానికి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో కేవలం తెలుగులోనే కాకుండా తమిళం హిందీలో కూడా తెరపైకి తీసుకు రాబోతున్నారు. అంతేకాకుండా వెంకీ అట్లూరి దర్శకత్వంలో కూడా సార్ అనే ఒక సినిమా చేసేందుకు ధనుష్ ఒప్పుకున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా ఇటీవల మొదలుపెట్టగా కోవిడ్ కారణంగా మళ్లీ బ్రేక్ పడింది.

నిర్మాతగా త్రివిక్రమ్ భార్య..
తొలిప్రేమ మిస్టర్ మజ్ను వంటి సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న వెంకీ అట్లూరి ధనుష్ కోసం గత ఏడాది నుంచి ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక త్రివిక్రమ్ ముందుండి ఆ ప్రాజెక్టును నడిపిస్తున్నట్లు సమాచారం. త్రివిక్రమ్ కూడా సీతారా ఎంటర్టైన్మెంట్స్ తన సొంత బ్యానర్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ ను జత చేస్తూ 'సార్' సినిమాను తెరపైకి తీసుకు వస్తున్నారు. నిర్మాతగా త్రివిక్రమ్ భార్య సౌజన్య పేరు వేసినప్పటికీ కూడా అన్ని పనులను త్రివిక్రమ్ సమక్షంలోనే కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

తప్పుకున్న హీరోయిన్
అసలు విషయంలోకి వస్తే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆలోచనతోనే హీరోయిన్ సంయుక్త మీనన్ సెలక్ట్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇటీవల సార్ సినిమా షూటింగ్ మొదలు కాగా రెండు రోజుల తర్వాత కోవిడ్ కారణంగా బ్రేక్ పడింది. ఇక అప్పుడే హీరోయిన్ సంయుక్త కూడా సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పడంతో ఆ విషయం కోలీవుడ్ మీడియాలో చర్చనీయాంశం గా మారింది.
Recommended Video

ఎందుకు తప్పుకుంది?
అఫీషియల్ గా హీరోయిన్ తప్పుకుంటున్నట్లు ఇంతవరకు ఎలాంటి ప్రకటన అయితే రాలేదు. కాని దాదాపు ఆమె ప్రాజెక్ట్ నుంచి వైదొలగినట్లు మీడియాలో కథనాలు అయితే గట్టిగానే వస్తున్నాయి. మరి ఈ విషయంలో చిత్ర యూనిట్ సభ్యులు ఏ విధంగా క్లారిటీ ఇస్తారో చూడాలి. అంతేకాకుండా సంయుక్త అంత పెద్ద ప్రాజెక్టు నుంచి ఎందుకు తప్పుకుంది అనే విషయంలో కూడా అనేక రకాల సందేహాలు వెలువడుతున్నాయి.


Click it and Unblock the Notifications











