నాగ్ సినిమాకు కష్టాలు.. ఆ విషయంలో ఇబ్బంది కలుగుతోందట
టాలీవుడ్ కింగ్ నాగార్జున.. వయసు మీద పడుతున్నా..యంగ్ హీరోలకు ధీటుగా ఫిట్‌నెస్ మెయింటెన్ చేస్తూ అందరికీ షాక్ ఇస్తున్నాడు. అటు వెండితెరపైనే కాకుండా ఇటు బుల్లితెరపైనా ట్రెండ్ క్రియేట్ చేస్తున్నాడు. రీసెంట్‌గా బిగ్ బాస్ మూడో సీజన్‌ను విజయవంతంగా హోస్ట్ చేశాడు. ఇటీవలె మన్మథుడు 2 చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు.
అయితే ఆ చిత్రం అనుకున్నంతగా ఆడలేదు. నాగ్ ప్రస్తుతం వైల్డ్ డాగ్ అనే యాక్షన్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఏసిపీ విజయ్ వర్మ అనే పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా నాగ్ పాత్ర పవర్‌ఫుల్‌గా ఉంటుందని టాక్. ఈ సినిమాలో నాగార్జున భార్య పాత్ర కోసం నిర్మాతలు పాపులర్ హీరోయిన్లను సంప్రదిస్తే వారు ఆసక్తి చూపించలేదని సమాచారం.

ఇప్పటికే ఓ ఇద్దరు పెద్ద హీరోయిన్లు వైల్డ్ డాగ్ ఆఫర్‌ను తిరస్కరించినట్టు సమాచారం. దీంతో నాగార్జునకు జోడీ వెతికే పనిలో చిత్రయూనిట్ పడినట్టు తెలుస్తోంది. కేవలం నాగ్ పరిస్థితే కాదు.. మిగతా సీనియర్ హీరోలందరికీ ఇదే సమస్య ఎదురవుతోంది. బాలకృష్ణ సినిమాకు హీరోయిన్‌ను వెతికి పట్టుకోవడం కత్తి మీద సాము అవుతోందట దర్శక నిర్మాతలకు. ఈ క్రమంలో బాలయ్య-బోయపాటి సినిమాకు ఇంకా హీరోయిన్‌ను ఫిక్స్ చేయలేదని టాక్. ఈ క్రమంలో నాగార్జున చిత్రానికి ఇలాంటి సమస్యే ఎదురైంది. మరి చివరకు వైల్డ్ డాగ్‌లో ఎవరు ఫిక్స్ అవుతారో చూడాలి.


Click it and Unblock the Notifications











