శ్రీలీలకు ఎదురు దెబ్బ! ఇక పవన్ కల్యాణ్‌పైనే భరోసానా?
సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యిన కొద్ది కాలంలోనే ఓ హీరో లేదా హీరోయిన్ కి మంచి ఫేమ్ రావడం అనేది చాలా తక్కువగా జరుగుతుంది. ఒకవేళ అలా జరిగినా ఆ క్రేజ్ అండ్ మార్కెట్ ని వాళ్ళు ఎంతవరకు నిలబెట్టుకున్నారు అనేది కూడా వారి కెరీర్ ని మరోస్థాయికి తీసుకెళ్లడానికి దోహదపడుతుంది. కాగా ఇలా తెలుగు సినిమా దగ్గర ప్రస్తుతం సెన్సేషన్ ని సెట్ చేసిన హీరోయిన్స్ ని చూస్తే అందులో ఫస్ట్ పేరుగా సెన్సేషనల్ యంగ్ బ్యూటీ శ్రీలీల ఉంటుంది.
కాగా శ్రీలీల తెలుగు సినిమా దగ్గర ఒక తెలుగు అమ్మాయి లేదు అనే లోటుని తీర్చేస్తూ ఇండస్ట్రీలోకి వచ్చిన కొన్నాళ్ల లోనే చక్రం తిప్పేసింది. ఒక సమయంలో అయితే ఇండియా లోనే మోస్ట్ బిజీ హీరోయిన్ గా కూడా మారింది. వరుస హిట్స్ తో మరిన్ని సినిమాల అవకాశాలు ఈమె దక్కించుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది. కానీ తెలుగులో వరుస సినిమాలు చేస్తూ వస్తున్న శ్రీలీలకి పెద్ద బ్రేకులే పడ్డాయి.

అప్పటివరకు హిట్ అయ్యిన సినిమాలు తర్వాత ఒకొకటిగా ప్లాప్ అవ్వడం మొదలు పెట్టాయి. ఒక్క గతేడాదిలోనే దాదాపు మూడు నుంచి నాలుగు సినిమాలు శ్రీలీల నుంచి విడుదల అయితే ఒక్క "భగవంత్ కేసరి" బాక్సాఫీస్ దగ్గర దాదాపు టార్గెట్ రీచ్ అయ్యింది కానీ మిగతా సినిమాలు అన్నీ ప్లాప్ లు, డిజాస్టర్స్ గానే మిగిలిపోయాయి. ఇక ఈ ఏడాదిలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేసిన బిగ్ ఆఫర్ "గుంటూరు కారం" కూడా రీచ్ కాలేక విఫలం అయ్యింది.
దీనితో ప్రస్తుతం శ్రీలీలకి బ్యాడ్ టైం కొనసాగుతూనే వచ్చింది. కాగా టాలీవుడ్ పై ఆశలు వదులుకున్న శ్రీలీల బాలీవుడ్ మార్కెట్ లోకి ఎంటర్ అవ్వడానికి సిద్ధం అయ్యింది. అక్కడైనా మంచి డెబ్యూ అందుకోవాలని చూసిన శ్రీలీలకి ఇప్పుడు ఆదిలోనే హంసపాదు ఎదురైనట్టుగా కొన్ని గాసిప్స్ వినిపిస్తున్నాయి. బాలీవుడ్ లో యువ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో శ్రీలీల డెబ్యూ ఇవ్వాల్సి ఉంది.

ఆల్రెడీ హీరోయిన్ గా ఆమె ఫిక్స్ అయ్యిపోయింది కానీ ఇప్పుడు ఈ సినిమా ఆగిపోయినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. హీరో దర్శకుడికి స్క్రిప్ట్ పరంగా లేవనెత్తిన విభేదాల కారణంగా సినిమా అయితే ఆగిపోయినట్టుగా ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి. దీనితో ఎన్నో అసలు పెట్టుకున్న బాలీవుడ్ ఎంట్రీకి ఆదిలోనే బ్రేక్ పడిందని అంటున్నారు. అసలే టాలీవుడ్ లో శ్రీలీల పరిస్థితి అంతంత మాత్రం గానే ఉంది.
పోనీ అక్కడైనా మొదటి సినిమా ఏదో అవుతుంది అనుకుంటే ఇంకేదో అయ్యింది. సో మళ్ళీ తెలుగు సినిమాలోనే హిట్ కొట్టాల్సిన అవసరం ఇప్పుడు శ్రీలీలకి ఉందని చెప్పాలి. కాగా ప్రస్తుతం తెలుగులో శ్రీలీల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, నితిన్ తో రాబిన్ హుడ్ ఇంకా పలు చిత్రాలను చేస్తుంది. మరి వీటిలో ఏదైనా హిట్ అయ్యి మళ్ళీ శ్రీలీల ని ఇండస్ట్రీలో ట్రాక్ లోకి తీసుకొస్తుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











