Krithi Shetty Vs Sreeleela: కృతిశెట్టిని చావు దెబ్బకొట్టిన శ్రీలీల.. రెమ్యూనరేషన్ ఏంతో తెలిస్తే షాకే!

ఒకరు రావడంతోనే సూపర్ హిట్టును అందుకున్నారు.. మరొకరు తొలిసినిమాతో పర్వాలేదనిపించారు. ఇద్దరూ ఆల్మోస్ట్ ఒకే సమయంలో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. వాళ్లేవరో కాదు.. కృతి శెట్టి, శ్రీలీల. ఉప్పెన సినిమాలో బేబమ్మగా నటించి.. అందరి మతిపోగొట్టింది కృతి. కానీ ఈ ముద్దుగుమ్మను ఫ్లాప్ లు వెంటాడుతున్నాయి. ఇక రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన పెళ్లి సందడి సినిమాతో శ్రీలీల.. ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. వరుస అవకాశాలను చేజిక్కించుకుంటోంది. వీళ్ల రెమ్యూనరేషన్ వివరాల్లోకి వెళితే...

రావడంతోనే బంపర్ హిట్: బుచ్చిబాబు సన దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన.. దర్శకుడికే కాదు.. అటు కృతి శెట్టికి, వైష్ణవ్ తేజ్ కు అందరికీ బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమా దాదాపు 100 కోట్లకు పైగా వసూలు సాధించింది. దీనితో కృతి ఫేట్ మారిపోయింది అనుకున్నారు అంతా.. వరుసగా ఆమెకు ఆఫర్లు క్యూ కట్టాయి. అందం, అభినయం ఉంటే సరిపోతుందా.. లక్ కూడా కలిసిరావాలి ఏమో.. తను ఒప్పుకున్న సినిమాలు అన్ని పరాజయం పాలయ్యాయి.

Krithi Shetty Vs Sreeleela:

వరుస పరాజయాలు: శ్యామ్ సింఘరాయ్ తో పర్వాలేదనిపించినా.. ఆ సినిమాలో కృతి సెకండ్ హీరోయిన్. ఆ తర్వాత నాగచైతన్య సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. బంగార్రాజు సినిమాలో తన అందంతో ఆకట్టుకుంది ఈ భామ. ఆ తర్వాత రామ్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ది వారియర్ సినిమాలో నటించగా.. ఆ సినిమా బోల్తా కొట్టింది. నితిన్ తో మాచర్ల నియోజకవర్గం సినిమా , సుదీర్ బాబుతో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, ఇటీవల రిలీజ్ అయినా కస్టడీ సినిమాలతో.. వరుసగా ఆమె ఖాతాలో డిజాస్టర్లు వేసుకుంది.

Krithi Shetty Vs Sreeleela:

ఫిదా అయిన ప్రేక్షకులు: మరోవైపు కన్నడ బ్యూటీ అయిన శ్రీలీల.. పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. ఆ తర్వాత రవితేజ ధమాకా సినిమాతో.. తన సత్తా ఏంటో నిరూపించుకుంది. ఈ సినిమాలో తన యాక్టింగ్ తో పాటు... డ్యాన్సులు, అందానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమాతో ఆమెకు వరుసగా ఆఫర్లు వచ్చాయి.

Krithi Shetty Vs Sreeleela:

దాదాపు 10 సినిమాలు: ఇప్పుడు తన చేతుల్లో ఏకంగా దాదాపు 10 సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది. వైష్ణవ్ తేజ్ ఆదికేశవ, బోయపాటి రామ్ కాంబోలో వస్తున్న మూవీ, నితిన్ 32 సినిమా, జూనియర్ అనే కన్నడ మూవీ, మహేశ్ త్రివిక్రమ్ ల గుంటూరు కారం, విజయ్ దేవరకొండ 12వ సినిమా, బాలయ్య భగవంత్ కేసరి, పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్.. ఇలా పెద్ద హీరోల సినిమాల్లో ఛాన్స్ కొట్టేసింది ఈ భామ. ఈ మధ్య గుంటురు కారం నుంచి పూజ ఎగ్జిట్ అవ్వడంతో.. మెయిన్ హీరోయిన్ ప్లేస్ ను శ్రీలీల దక్కించుకుంది. ఇలా వరుస ఆఫర్లతో జోరు మీద ఉంది ఈ భామ. ఇవే కాకుండా మరోసారి రవితేజతో ఈ భామ మళ్లీ జతకట్టనుందని సమాచారం.

Krithi Shetty Vs Sreeleela:

కృతిని చావుదెబ్బేసిన శ్రీలీల: అయితే ఈ ఇద్దరూ హీరోయిన్లు ఒకేసారి వచ్చినప్పటికీ... కృతి ఆఫర్లను శ్రీలీల కొట్టేసిందనే చెప్పాలి. బేబమ్మను చావుదెబ్బకొట్టిందని అనుకుంటున్నారు నెటిజన్స్. కృతి రెమ్యూనరేషన్ విషయానికి వస్తే.. ఆమె ఒక్క సినిమాకు ఒక కోటి 20 లక్షలు తీసుకుంటుండగా.. శ్రీలీల ఒక్కో సినిమాకు 2 కోట్లు తీసుకుంటుంది. శ్రీలీల ఆఫర్లతో దూసుకుపోతుంటే.. కృతి చేతిలో ఆఫర్లు లేనట్లు తెలుస్తోంది. చూడాలి ఇక.. శ్రీలీల కెరియర్ ఎలా ఉండనుందో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X