Sreeleela: దిల్ రాజు ఫంక్షన్ లో శ్రీలీల మ్యాజిక్... అందరి చూపు ఆమెపైనే
కన్నడ బ్యూటీ శ్రీలీల... పెళ్లి సందడి సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. అయితే ఈ సినిమా తర్వాత ఈ బ్యూటీకి వరుస ఆఫర్లు వచ్చాయి. అంతేకాకుండా ఈ ముద్దుగుమ్మ నటించిన అన్ని సినిమాలు సూపర్ హిట్టుగా నిలిచాయి. ఇప్పుడు ఈ భామ చేతిలో ఏకంగా 10 సినిమాలు ఉన్నట్లు సమాచారం. అయితే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తన ఫోటోలు వైరల్ గా మారాయి. ఆ వివరాల్లోకి వెళితే...

మొదటి సినిమాతోనే...: ఇటీవల రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన పెళ్లిసందడి సినిమాతో శ్రీలీల టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత ధమాకాతో మరో హిట్టును తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు ఈ భామ చేతిలో గ్యాప్ లేకుండా సినిమాలు ఉన్నాయి. ఏకంగా 8 సినిమాలు సెట్స్ మీద ఉండగా.. మరో రెండు సినిమాల్లో శ్రీలీలను తీసుకుంటున్నారని తెలుస్తోంది.

ఏకంగా పది సినిమాలు...:ఇక పంజా వైష్ణవ్ తేజ్ తో ఆదికేశవ, బోయపాటి రామ్ పోతినేని సినిమా, నితిన్ 32 సినిమా, భగవంత్ కేసరి, గుంటూరు కారం, విజయ్ దేవరకొండ 12, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలతో పాటు... మెగాస్టార్ చిరంజీవి, సిద్దూ జొన్నలగడ్డ మూవీలో కూడా శ్రీలీలను తీసుకోబోతున్నారని సమచారం. అంతేకాకుండా రవితేజ మరోసారి శ్రీలీలతో సినిమా చేయబోతున్నారని టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

మత్తెక్కించే చూపులతో...:ఇదిలా ఉంటే ఈ భామ... సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా షేర్ చేసిన ఫోటోలు కుర్రకారును టెంప్టె చేస్తున్నాయి. బ్లాక్ అండ్ వైట్ ఫిట్ టాప్ లో శ్రీలీల కెమెరాకు ఫోజులు ఇచ్చింది. ఇప్పుడు ఈ ఫోటోలు కుర్రకారు గుండెల్లో మంటలు రేపుతున్నాయి. మత్తెక్కించే చూపులతో శ్రీలీల.. ఈ ఫోటోల్లో కనిపిస్తోంది. దానితో పాటు.. నిన్న నిర్మాత దిల్ రాజు కొడుకు మొదటి పుట్టినరోజు వేడుకల్లో మెరిసింది ఈ భామ. ఇప్పుడు ఆ వీడియోలు సైతం వైరల్ గా మారాయి.

ఏం అందం రా బాబు..:దిల్ రాజు రెండో భార్య కొడుకు బర్త్ డే నిన్న ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సినీ ప్రముఖులు హాజరయ్యారు. శ్రీలీల కూడా హాజరుకాగా.. ఆమె అందానికి అక్కడివారు ఫిదా అయ్యారు. మెరూన్ కలర్ ట్రెడిషనల్ డ్రెస్ లో నడుస్తూ కెమెరాకు పోజులివ్వగా.. ఇప్పుడు ఆ వీడియో వైరల్ గా మారింది. ఇక ఆమె నడక, అందం, నవ్వుకు కెమెరాలన్నీ ఆమెవైపే చూస్తూ ఉండిపోయాయని చెప్పాలి. అవి చూసిన నెటిజన్స్.... ఏం అందం రా బాబు, అస్సలు తగ్గట్లేదుగాఅంటూ కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











