Sreeleela: ఆ ఇద్దరు హీరోయిన్లను ముంచిన శ్రీలీల.. అందుకే ఇన్ని ఛాన్సులా?

తెలుగు చిత్రసీమలో ఇప్పుడు ఏ కొత్త సినిమా అనౌన్స్ మెంట్ వచ్చినా.. అందులో హీరోయిన్ గా శ్రీలీల పేరే వినిపిస్తోంది. యంగ్ హీరోల నుంచి స్టార్ కథానాయకుల వరకు అందరూ ఈమెతోనే నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. అయితే ఇంతటి ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మకు ఇన్ని అవకాశాలు, ఇంతటి ఫేమ్ రావడానికి కారణం ఓ ఇద్దరు హీరోయిన్లు అనే చెప్పాలి. వాళ్ల వల్లే ఇదంతా జరిగిందని అంతా అంటున్నారు. ఇంతకీ ఆమె ఎవరంటే?

సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. రంగు రంగుల ఊహా ప్రపంచం కదా.. ఏదైనా జరగొచ్చు. దశ తిరిగితే ఒకరు ఓవర్ నైట్ స్టార్ అవొచ్చు. ఇంకొకరు అవశాలు దొరక్క పరాజయాలను ఎదుర్కొంటూ వాషౌట్ అయిపోవచ్చు. కాబట్టి ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు, స్వాగతించేందుకు
ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఇప్పుడిదంతా మాట్లాడుకోవడానికి కారణం ముగ్గరు అందమైన భామలు. ఒకరు పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే, ఇంకొకరు అందం అభినయంతో కట్టిపడేసే కృతిశెట్టి, మరొకరు తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో మాయ చేసే శ్రీలీల.

Heroine Sreeleela is getting a series of movie offers

వంద కోట్ల హిట్... :శ్రీలీల విషయానికొస్తే.. ఇప్పటివరకు ఆమె తెలుగులో చేసింది రెండే సినిమాలు. కానీ సంపాదించుకున్న క్రేజ్ బోలెడంత. రాఘవేంద్రరావు దర్శకత్వంలో పెళ్లి సందడితో పరిచయమైన ఈ ముద్దుగుమ్మ భారీ హిట్ అందుకోకపోయిన క్యూట్ యాక్టింగ్ తో ఆకట్టుకుంది. ఆ తర్వాత రవితేజ ధమాకాతో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకుంది. అంతేకాకుండా ఈ చిత్రంతో తన మాస్ డ్యాన్స్ తో అభిమానులను ఉర్రూతలూగించింది. దీంతో ఆమెకు వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి.

ఏకంగా పది చిత్రాలు... :ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా పది నుంచి పదమూడు సినిమాలు శ్రీలీల చేతిలో ఉన్నాయని తెలిసింది. వారిలో సగం మంది స్టార్ హీరోలు ఉండటం మరో విశేషం. పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, బాలకృష్ణ, నితిన్, విజయ్ దేవరకొండ.. ఇలా పలువురు ప్రముఖ కథానాయకులు ఉన్నారు. అలా ఇప్పుడు మకుటం లేని మహారాణిగా రాణిస్తోంది. దీనికి కారణం ధమాకా సినిమా సూపర్ హిట్ గా నిలవడమనే చెప్పాలి.

Heroine Sreeleela is getting a series of movie offers

పూజా ఔట్.. శ్రీలీల ఎంట్రీ... :అయితే ఈ ధమాకా సినిమాలో మొదటిగా శ్రీలీలను అనుకోలేదట. పూజాహెగ్డే అనుకున్నారట. కథ నచ్చినా .. రవితేజ వరుస ఫ్లాప్ లతో ఉండటం వల్ల సినిమాకు నో చెప్పిందట పూజా. దీంతో ఈ అవకాశం శ్రీలీల దగ్గరకు వెళ్లింది. తనకంటే వయసులో రెండింతలు పెద్ద అయిన రవితేజతో కలిసి నటించడానికి ఓకే చెప్పి శ్రీలీల పెద్ద సాహసమే చేసింది. ఆ సాహసం వర్కౌట్ అయింది. సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచి వంద కోట్ల వసూళ్లు వచ్చాయి. అంతే ఇక శ్రీలీల తిరిగి చూసుకోవాల్సిన అవసం రాలేదు.

ఆ రెండు చిత్రాల్లోనూ.. :ధమాకానే కాదు.. పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలోనూ పూజ హెగ్డేనే మొదట హీరోయిన్. కానీ లాస్ట్ మూమెంట్ లో ఏమైందో తెలీదు కానీ పూజా సినిమా నుంచి ఔట్ అయింది. శ్రీలీల ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ భామ ఇక్కడితో ఆగిపోలేదు. సూపర్ స్టార్ మహేశ్ బాబు చేస్తున్న గుంటూరు కారం సినిమాలోనూ శ్రీలీల కన్నా ముందుగా పూజ హెగ్డేనే అనుకున్నారు. కానీ మళ్లీ పూజాహెగ్డే ఔట్. ఆమె స్థానంలో శ్రీలీల మెయిన్ హీరోయిన్ అయింది. ఇలా తెలిసో తెలియకో పూజా హెగ్డే.. తప్పుకోవడం అవి శ్రీలీలకు వరించడం జరిగింది. అలా శ్రీలీల పాలిట అదృష్ట దేవతగా పూజా హెగ్డే మారిపోయిందని అంతా అనుకుంటున్నారు.

Heroine Sreeleela is getting a series of movie offers

కృతి విషయంలోనూ...:ఇక కృతిశెట్టి విషయంలోనూ అదే జరుగుతోంది. ఈ భామ ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో.. వరుస ఆఫర్లు వచ్చాయి. కానీ ఈ భామకు కలిసి రాలేదు. వరుసగా సినిమాలు ఫ్లాప్ అవుతూ వచ్చాయి. ఈ భామ చేసిన సినిమాలు ఫ్లాప్ అవ్వడం.. అదే క్రమంలో శ్రీలీల జోష్ చూసిన దర్శకులు ఆమెకు ఛాన్సులు ఇస్తూ పోయారు. కొన్ని సినిమాలు కృతి చేయాల్సినవి.. శ్రీలీల కొట్టేసిందని సమాచారం. మొత్తానికి శ్రీలీల దెబ్బకు ఇద్దరు హీరోయిన్ల ఫేం తగ్గిందనే చెప్పాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X