Sreeleela:తప్పు చేశావ్ శ్రీలీల!.. 'బేబీ' విషయంలో అలా చేయకుండా ఉండాల్సిందేమో.. !
రవితేజ 'ధమాకా'తో సూపర్ సక్సెస్ ను అందుకుని.. ప్రస్తుతం దాదాపు 10 - 12 సినిమాలలో పుల్ బిజీగా ఉన్న అందాల భామ శ్రీలీల. కుర్రాళ్ల క్రష్ గా యూత్ లో ఫుల్ క్రేజ్ తో కెరీర్ లో దూసుకెళ్తున్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా రిలీజై సూపర్ సక్కెస్ అందుకున్న 'బేబీ' చిత్రం విషయంలో ఓ తప్పు చేసిందని తెలిసింది. వివరాల్లోకి వెళితే...
ఇండస్ట్రీ అన్నాక సినిమాల విషయంలో పలు సందర్భాల్లో ఒకరు చేయాల్సింది మరొకరు చేస్తుంటారు. డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడం, కథ నచ్చకపోవడం, క్రియేటివ్ ఢిఫరెన్స్ రావడం... ఇలా రకారకాల కారణాల వల్ల సినిమాలు ఒకరి చేతి నుంచి మరొకరి చేతికి వెళ్లిపోతుంటాయి. అలా ప్రస్తుతం యంగ్ బ్యూటీ, ఫుల్ ఫామ్ లో ఉన్న హీరోయిన్ శ్రీలీల కూడా ఇదే జరిగింది. ఓ సూపర్ హిట్ సినిమాను చేతులారా వదిలేసిందని తెలిసింది. ఇప్పుడా హిట్ సినిమాలో వేరే హీరోహీరోయిన్ అదిరిపోయే బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుని సూపర్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు.

ఆ చిత్రం ఏంటంటే..:రీసెంట్ గా రిలీజ్ కు ముందే సాంగ్స్, టీజర్, ట్రైలర్ తో అందరి దృష్టినీ ఆకర్షించిన చిత్రం 'బేబీ'. టాలీవుడ్ రౌడీ హీరో సెన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండ బ్రదర్ ఆనంద్ దేవరకొండ నటించిన చిత్రమిది. యూట్యూబర్ వైష్ణవి చైతన్య ఈ చిత్రంతో హీరోయిన్ గా మారింది. కలర్ ఫొటో చిత్రానికి కథ అందించిన సాయి రాజేష్ ఈ బేబీ సినిమాకు దర్శకత్వం వహించారు. టాక్సీవాలా తర్వాత ఎస్‌కేఎన్ సోలోగా నిర్మించిన చిత్రం. నేడు(జులై 14) రిలీజైన ఈ చిత్రం పక్కా యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ టాక్ ను అందుకుంది.

శ్రీలీల మిస్.. :ఆనంద్ దేవరకొండకు కెరీర్ లో ఫస్ట్ హిట్. అలాగే హీరోయిన్ గా వైష్ణవి చైతన్యకు తొలి సినిమాతోనే సక్సెస్. మరి ఇలాంటి భారీ సక్సెస్ అందుకున్న సినిమా హీరోయిన్ గా చేసే అవకాశం వస్తే మిస్ చేసుకుంది శ్రీలీల. మరి ఇందులో నిజమెంతో తెలియదు కానీ ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

కారణం ఏమై ఉంటుందో... :దర్శకుడు సాయి రాజేశ్.. హీరోయిన్ గా శ్రీలీల అయితే బాగుంటుందని భావించారట. మంచి ఫేమ్ ఉన్న అమ్మాయి.. యూత్ లో క్రేజ్ ఉన్న హీరోయిన్.. అలాగే తన పాత్రకు సెట్ అయ్యే ఈ జనరేషన్ అమ్మాయి కావాలని అనుకున్నారట. అందుకు శ్రీ లీల అయితే కరెక్ట్ గా సెట్ అవుతుందని ఫిక్స్ అయ్యారట. కానీ కారణం తెలీదు.. శ్రీలీల ఈ సినిమా ఛాన్స్ ను మిస్ చేసుకుందట. దీంతో దర్శకుడు లో బడ్జెట్ లో వైష్ణవి చైతన్య ను ఎంచుకున్నారట.

అద్భుతంగా సినిమా... :అలా ఆ తర్వా హీరో - హీరోయిన్ - సెకండ్ హీరో కాంబో సెట్ అవ్వడంతో సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు సాయి రాజేష్. ముఖ్యంగా ఈ తరం యువతకు బాగా కనెక్ట్ అయ్యేలా తీశారు. సినిమాలో కనిపించే చాలా సీన్స్.. ఈ కాలం యువతీ యువకుల మధ్య ఉన్న ప్రేమ.. వారి ఆలోచనా విధానాలను కళ్లకు కట్టినట్టుగా చూపించారు.


Click it and Unblock the Notifications











