Remuneration: రేటు పెంచేసిన త్రిప్తి దిమ్రి.. 6 కోట్లకు రాదట.. ఇప్పుడు ఎంతో తెలుసా?

కొంతమంది హీరోయిన్స్ కి అయితే ఇండస్ట్రీలో పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ సినిమాలు కంటే గ్లామర్ షో చేస్తే ఎక్కువ క్రేజ్ వస్తుంది అని ఓ హీరోయిన్ విషయంలో అయితే ప్రూవ్ అయ్యిందని చెప్పాలి. అప్పటివరకు ఎలాంటి స్కిన్ షో చేయకుండా ఒక నటిగా మంచి రోల్స్ చేస్తూ వెళ్ళింది కానీ ఆమె మొట్ట మొదటిగా ఒక బోల్డ్ రోల్ చేసేసరికి అంతకు ముందు ఎప్పుడు కూడా లేని ఫేమ్ ని ఆమె సొంతం చేసుకుంది.

మరి ఆ హీరోయిన్ ఎవరో కూడా కాదు గత ఏడాది క్రేజీ హిట్ చిత్రం ఆనిమల్ సినిమాలో సెకండాఫ్ లో కనిపించిన హాట్ అండ్ బోల్డ్ బ్యూటీ త్రిప్తి దిమ్రి అని చెప్పాలి. ఒక్క సినిమా చాలు ఎవరిని అయినా ఓవర్ నైట్ స్టార్ చేయడానికి. మరి అలా తనకి వచ్చిన ఆనిమల్ ఆఫర్ తో త్రిప్తి ఒక్కసారిగా నేషనల్ మీడియాలో హైలైట్ అయ్యిపోయింది.

Heroine Tripti Dimri hikes remuneration shockingly after Animal and Bad Newz blockbusters

నిజానికి ఆ సినిమా హీరోయిన్ రష్మికా కంటే ఎక్కువ ఫేమ్ ని ఈ సినిమాతో త్రిప్తి అందుకుంది అని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. సరే ఇదిలా ఉండగా జనానికి ఏం కావాలో అదే చేయాలి అన్నట్టుగా ఈ సినిమా తర్వాత బోల్డ్ పాత్రలే ఎంచుకుంటూ సినిమాలు చేస్తుంది. అలా బాలీవుడ్ లో రీసెంట్ గా చేసిన చిత్రమే "బ్యాడ్ న్యూజ్". విక్కీ కౌశల్ హీరోగా నటించిన ఈ అడల్ట్ కామెడి డ్రామాలో త్రిప్తి రెచ్చిపోయింది.

ఆమె అంద చందాలు ఆరబోసి ఆనిమల్ తర్వాత మరోసారి హాట్ టాపిక్ గా మారింది. కాగా ఇంత ఫేమ్ ఉన్నాక ఏ హీరోయిన్ అయినా తక్కువ రెమ్యునరేషన్ ని డిమాండ్ చేస్తుందా? అలానే బ్యాడ్ న్యూజ్ సినిమాకి భారీ మొత్తంలో 6 కోట్ల రెమ్యునరేషన్ ని తీసుకున్న త్రిప్తి ఈ సినిమా హిట్ కావడంతో ఇప్పుడు తన పారితోషికాన్ని మరింత పెంచేసిందట.

Heroine Tripti Dimri hikes remuneration shockingly after Animal and Bad Newz blockbusters

కాగా బాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం త్రిప్తి మరో నాలుగు కోట్లు పెంచి ఈసారి నుంచి సినిమాకి 10 కోట్ల రెమ్యునరేషన్ ని అందుకుంటుందని వినిపిస్తుంది. దీనితో ఒకప్పుడు కేవలం లక్షల్లో మాత్రమే ఛార్జ్ చేసే ఈమె కేవలం ఒక్క ఏడాదిలోనే ఊహించని జంప్ తో ఇంత డెవలప్ అయ్యింది. మరి రానున్న రోజుల్లో ఇంకా మంచి సినిమాలు పడితే మాత్రం త్రిప్తి ఇండియాలోనే హైయెస్ట్ పైడ్ హీరోయిన్ గా నిలిచినా ఆశ్చర్యం లేదని చెప్పాలి.

ఇలా మొత్తానికి ఒకే ఒక్క సినిమా ఈమె లైఫ్ నే మార్చేసింది. కాగా ఇపుడు ఈ హాట్ బ్యూటీ ఒక్క బాలీవుడ్ సినిమాలోనే కాకుండా సౌత్ నుంచి టాలీవుడ్ లో కూడా పలు సినిమా అవకాశాలు అందుకుంటున్నట్టుగా వినిపిస్తుంది. అయితే ఆనిమల్ తర్వాతే తెలుగు సినిమా నుంచి కూడా చాలా ఆఫర్స్ వచ్చాయని టాక్ ఉంది కానీ ఆమెకి నచ్చిన సబ్జెక్టు పడక తెలుగు ఎంట్రీ ఆలస్యం అయ్యినట్టు టాక్ ఉంది. అయితే రీసెంట్ గానే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ "పుష్ప 2" లో ఐటెం సాంగ్ కి ఫిక్స్ అయ్యింది అని కూడా పలు రూమర్స్ వచ్చాయి. మరి చూడాలి ఈమె సౌత్ ఎంట్రీ ఎప్పుడు ఎవరితో ఉంటుంది అనేది.

More from Filmibeat

Read more about: pushpa 2 tripti dimri bad newz
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X