Nandamuri Balakrishna: బాలయ్య బాబుతో జత కట్టనున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?
భగవంత్ కేసరి మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు బాలయ్య బాబు. దసరా కానుకగా వచ్చిన ఈ మూవీ అక్టోబర్ 19వ తేదీన రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అనిల్ రావిపూడి, బాలకృష్ణ.. ఈ కాంబోలో వచ్చిన మూవీపై మొదటి నుంచి అటు బాలయ్య బాబు అభిమానుల్లో, ఇటు అనిల్ రావిపూడి అభిమానులతో పాటు సినీ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.
పక్కా మాస్, ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చే బాలయ్యను అనిల్ రావిపూడి ఎలా చూపించనున్నాడు, బాలయ్య మార్క్ హీరో మ్యానరిజంను అందించగలుగుతాడా అనే అనుమానాలు ఒకవైపు, ఈ మూవీ మంచి హిట్ అవుతుందన్న భారీ అంచనాలో మరోవైపు ఉండగా ఈ సినిమా రిలీజై మంచి టాక్ తో దూసుకుపోతోంది.

నేలకొండ భగవంత్ కేసరి - NBK పాత్రలో బాలయ్య బాబు చాలా కొత్తగా కనిపించాడు. అనిల్ రావిపూడి మార్క్ కామెడీతో పాటు, బాలయ్య మార్క్ మాస్ మసాలా సమపాళ్లలో ఉండటంతో థియేటర్లలో ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమా సక్సెస్ ను ఒకవైపు ఎంజాయ్ చేస్తూనే, మరోవైపు తన తదుపరి ప్రాజెక్టుపై బాలయ్య బాబు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
బాలయ్య బాబు తదుపరి ప్రాజెక్టు గురించి ఓ క్రేజీ గాసిప్ బయటకు వచ్చింది. మంచి ఫామ్ లో ఉన్న హీరోయిన్, బాలయ్య బాబుకు మంచి జోడీ అనదగ్గ బ్యూటీని బాలయ్య బాబు నెక్ట్స్ మూవీకి లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఒకప్పుడు టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ హీరోలతో ఎన్నో విజయవంతమైన సినిమాలు చేసి ఆ తర్వాత అవకాశాలు లేక ఇబ్బందిపడ్డ రోజుల నుంచి తిరిగి మళ్లీ ఫామ్ అందుకుని దూసుకుపోతున్న హీరోయిన్ ను బాలయ్య కోసం ఫిక్స్ చేసినట్లు సమాచారం.

ఆ హీరోయిన్ మరెవరో కాదు త్రిష అంట. కొన్నాళ్ల పాటు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పంది త్రిష. ఆ తర్వాత క్రమంగా అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో కోలీవుడ్ కే పరిమితం అయిన సంగతి తెలిసిందే. చిరంజీవి, నాగార్జున, మహేష్, ప్రభాస్ లాంటి అగ్ర హీరోలతో సినిమాల్లో హీరోయిన్ గా నటించింది త్రిష. ఆ తర్వాత క్రమంగా తన సొంత భాష తమిళ సినిమాలకే పరిమితం అయింది. ఈ క్రమంలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేసింది. అయితే అవేవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.
కానీ పొన్నియన్ సెల్వన్ రెండు పార్ట్స్ లోనూ త్రిష నటించి మెప్పించింది. తన అదిరిపోయే అందంతో, అభినయంతో ఆకట్టుకుంది. ఆ సినిమా ద్వారా మరోసారి ఫామ్ లోకి వచ్చింది త్రిష. ఈ రెండు పార్టుల తర్వాత సోషల్ మీడియాలోనూ త్రిషకు క్రేజ్ పెరిగిందనే చెప్పాలి. అలా దళపతి విజయ్ మూవీ లియోలో నటించే అవకాశం చేజిక్కించుకుంది. అందులోనూ తన అందంతో, నటనతో మెప్పించింది.

చిరంజీవి చేయబోయే సినిమాలో త్రిష పేరును పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడు బాలయ్య సరసన కూడా నటించే అవకాశాన్ని చేజిక్కించుకున్నట్లు సమాచారం. త్వరలోనే డైరెక్టర్ బాబీ, బాలయ్య కాంబోలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ కోసమే త్రిషను లాక్ చేయాలని భావిస్తున్నట్లు దర్శకుడు బాబీ, నిర్మాత నాగవంశీ భావిస్తున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











