41 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోబోతున్న వరుణ్ సందేశ్ హీరోయిన్.. వరుడు ఎవరో తెలుసా?
ఈ మధ్య కాలంలో చాలా మంది హీరోయిన్లు ఏజ్ బార్ అవుతున్నా పెళ్లి గురించే ఆలోచించట్లేదు. 30 నుంచి 35 ఏళ్ల వయసు వచ్చాకా కొందకు వివాహం చేసుకోవాలనుకుంటే మరికొందరేమే 40 ఏళ్లు వచ్చిన ఎందుకు అంత తొందర అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అసలు వీరికి పెళ్లి చేసుకున ఆలోచన ఉందో లేదోనని కూడా చాలా మందిని చూస్తే అనిపిస్తుంటుంది. స్టార్ హీరోలు అయినా హీరోయిన్లు అయినా లైఫ్ లో బాగా సెటిల్ అయ్యాకే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. ప్రేమ వ్యవహారాలు, డేటింగ్ లు జరిపిస్తూనే కాలం వెళ్లదీస్తున్నారు.
ఇలాంటి వాళ్లలో చాలా మంది స్టార్ హీరోహీరోయిన్లు ఉన్నారు. ఏళ్లుగా ప్రేమాయణం సాగిస్తూ.. పెళ్లి చేసుకోవడానికి మాత్రం చాలా ఆలోచిస్తున్నారు. అలాంటి వాళ్లలో తమన్నా భాటియా, విజయ్ వర్మలు ముందు వరుసలో ఉండగా.. రెండో స్థానంలో వరుణ్ సందేశ్ హీరోయిన్ ఉంది. ఆమే.. ఎవరైనా ఎపుడైనా సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన విమలా రామన్. ప్రస్తుతం 41 ఏళ్ల వయసు కల్గిన ఈ క్యూట్ బ్యూటీ ఇంత కాలం పెళ్లి ఊసెత్తలేదు. కానీ తాజాగా ఈమె తన ప్రియుడినే పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

వయసు పెరుగుతున్నా కొద్దీ ఇంట్లో పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి ఎక్కువవడంతో ఆమె పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే విమలా రామన్ పెళ్లి చేసుకోబోయేది మరెవరినో కాదండీ.. తమిళ నటుడు వినయ్ రాయ్ ను. గత కొంత కాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. వీరిద్దరు కూడా అది నిజమే అన్నట్లు ప్రూవ్ చేసేందుకు చాలా సోషల్ మీడియా వేదికగా వీరి ఫొటోలను పెట్టే వాళ్లు. అంతేకాకుండా వీరిద్దరూ చాలా సార్లు మీడియా కంట పడ్డారు. దీంతో వీరి మధ్య ప్రేమ నడుస్తుందనే వార్తలకు మరింత బలం చేకూరింది.
ప్రస్తుతం విమలా రామన్ చేతిలో ఎలాంటి సినిమాలు లేకపోవడం, ఇంట్లో వాళ్ల ఒత్తిడి కూడా ఎక్కువవడంతో ఆమె పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తుందట. ఇదే విషయాన్ని ప్రియుడు వినయ్ రాయ్ కు చెప్పగా అతడు కూడా ఒప్పుకున్నాడు. ఇక ఆలస్యం చేయకూడదు అనుకున్న ఈ జంట.. ఈ ఏడాదిలోనే మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కావాలని ప్లాన్ చేసుకుంటున్నారట. అయితే అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించలేదు. కానీ త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.

ఆస్ట్రేలియాలో పుట్టి పెరిగిన విమలా రామన్ 2006లో పోయి అనే తమిళ సినిమాతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ చిత్రాల్లోనూ నటించింది. కానీ పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. అనుకున్న స్థాయిలో హిట్టు కొట్టకపోయినా.. ఇంకా హీరోయిన్ గా చాలానే ప్రయత్నాలు చేస్తోంది. అయినప్పటికీ పెద్దగా అవకాశాలు రాకపోవడంతో పెళ్ల చేసుకోవడానికి సిద్ధమైంది. చూడాలి మరి ఇప్పుడు మనం ఈ వార్త వింటామో.


Click it and Unblock the Notifications











