Vimala Raman పెళ్లికి సిద్దమైన విమలారామన్.. టాలీవుడ్ విలన్‌తో పెళ్లి పీటలపైకి సీనియర్ బ్యూటీ
ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు అందరూ పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. 30 ఏళ్లు నిండకుండానే హీరోలు, హీరోయిన్లు తమకు నచ్చినవారిని వివాహమాడి వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నారు. కొన్ని రోజుల క్రితమే హీరో అర్జున్ కుమార్తె ఐశ్వర్య తాను ప్రేమించిన ఉమాపతి రామయ్యను వివాహమాడింది. ఇకబాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా సైతం ప్రేమించివాడితో మూడు ముళ్ళు వేయించుకొంటుంది. ఇంకోపక్క లేడీ విలన్ వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా వచ్చే నెల పెళ్లి కూతురు కాబోతుంది. ఈ నేపథ్యంలోనే మరో సీనియర్ బ్యూటీ కూడా పెళ్ళికి సిద్దమయ్యింది. ఆమె ఎవరో చూద్దాం రండి.
ఎవరైనా ఎప్పుడైనా అనే సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ విమలా రామన్. ఈ సినిమా ఆమెకు ఆశించిన ఫలితాన్ని అందివ్వలేకపోయినా.. అమ్మడి అందానికి అయితే తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ తరువాత విమలా రామన్ గాయం-2, రంగ ది దొంగ, రాజ్, చట్టం, కులుమనాలీ, నువ్వా నేనా, చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి, ఓం నమో వేంకటేశాయ లాంటి సినిమాల్లో నటించింది.

తెలుగులో సినిమాలు చేసినా కూడా విమలాకు అంతగా గుర్తింపు మాత్రం దక్కలేదు. అందుకే ఆమె తెలుగు నుంచి తమిళ్ కు షిఫ్ట్ అయ్యింది. అక్కడ సినిమాలు చేస్తూ బాగానే సెటిల్ అయ్యింది. ఈ మధ్య ఆమె తెలుగులో కూడా రీఎంట్రీ ఇచ్చింది. అశ్విన్స్, రుద్రంగి, వరుణ్ తేజ్ నటించిన గాండీవధారి అర్జున చిత్రాల్లో కీలక పాత్రలు పోషించింది.
విమలా రామన్ సినిమాలు విషయం పక్కన పెడితే.. 45 ఏళ్ల ఈ బ్యూటీ గత కొన్ని ఏళ్లుగా నటుడు వినయ్ రాయ్ తో ప్రేమాయణం నడుపుతున్న విషయం తెల్సిందే. వినయ్ రాయ్ తెలుగువారికి కూడా సుపరిచితడే. తెలుగులో వాన అనే సినిమాలో హీరోగా మరించి మెప్పించాడు వినయ్. ఆ తరువాత తమిళ్ లోనే సెటిల్ అయిన ఈ నటుడు.. డిటెక్టివ్ సినిమాలో విలన్ గా రీఎంట్రీ ఇచ్చాడు.

హీరోగా కంటే విలన్ గానే స్టార్ డమ్ ను అందుకోవడంతో దాన్నే కంటిన్యూ చేశాడు. ఈ ఏడాది భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న హనుమాన్ లో కూడా వినయ్ రాయ్ నే విలన్ గా నటించి మెప్పించాడు. గత కొంతకాలంగా విమలా, వినయ్ డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వినిపించాయి. ఆ తరువాత వారు సహజీవనంలో ఉన్నారని కూడా తెలిసింది. గత నెలలోనే ఈ జంట తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు కూడా.
తాజగా అందుతున్న సమాచారం ప్రకారం.. వీరు త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారట. ఇప్పటికే ఈ జంట యొక్క కుటుంబాలు పెళ్లి పనులు కూడా మొదలుపెట్టాయని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే వినయ్ , విమలా తమ పెళ్లి వార్తను కూడా అధికారికంగా చెప్పనున్నారని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. మరి పెళ్లి తరువాత ఈ అమ్మడు నటిస్తుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











