శింగనమల అరెస్టుతో ఆ తెలుగు హీరోయిన్ టెన్షన్
నిర్మాత శింగనమల రమేష్ ని పోలీసులు అరెస్టు చేయటంతో నటి దీక్షాసేధ్ కు టెన్షన్ పట్టుకున్నట్లు సమాచారం. దానకి కారణం ఆమెకు సింగనమలతో లింక్ లు ఉండటం కాదు. విక్రమ్ హీరోగా సింగనమల నిర్మిస్తున్న తమిళ చిత్రంలో ఆమె హీరోయిన్ గా చేయటమే కారణం. తెలుగులో గోపీచంద్ వాంటెడ్, రవితేజ మిరపకాయ చిత్రాలతో బిజీగా మారిన ఆమె ఏకంగా విక్రమ్ చిత్రంలో హీరోయిన్ గా ఎంపికవటమతే చాలా సంతోషం ఫీలైంది. ఖలేజా, పులి చిత్రాల నిర్మాత శింగనమల రమేష్ నిర్మిస్తున్న కొత్త చిత్రంలో ఆమెను విక్రమ్ కి జోడీగా ఎంపిక చేసారు.
ఈ విషయాన్ని ఆయన మీడియాకు తెలియచేస్తూ...విక్రమ్ చేసే విభిన్న చిత్రాల స్థాయిలోనే ఈ సినిమా కడా వైవిధ్యంగా ఉంటుంది. అలాగని కమర్షియల్ విలువలు ఎక్కడా మిస్ కానివ్వము అంది. ఇక ఈ చిత్రాన్ని సుశీ డైరక్ట్ చేస్తున్నారు. తెలుగు,తమిళ,హిందీ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కనుంది. అలాగే ఈ చిత్రంలో అభినయ మరో హీరోయిన్ గా చేస్తోంది. ఇక దర్శకుడు సుశీ గణేషన్ గతంలో విక్రమ్ తో మల్లన్న అనే సూపర్ ప్లాప్ చిత్రం ఇచ్చారు.ఇప్పుడు సింగనమల అరెస్టుతో ఆ చిత్రం ఉంటుందా ..ఉండదా అనే డైలమోలో పడింది.ఈ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న దీక్షా కూడా ఈ అరెస్టు దెబ్బకు నీరసపడింది.


Click it and Unblock the Notifications











