డ్రగ్స్ ఎఫెక్ట్: వరుణ్‌కు దూరం ఉంటున్న భామలు
టాలీవుడ్ తారలు డ్రగ్స్ మత్తులో జోగడం ఈ మధ్య ఎక్కువైన సంగతి తెలిసిందే. ఆ మధ్య హీరో రవితేజ సోదరులు డ్రగ్స్ కొంటూ అడ్డం దొరిక పోగా, అనంతరం ఓ నిర్మాత డ్రగ్స్ సరఫరా చేస్తు పట్టు పడ్డారు. ఈ హైక్లాస్ మత్తు అలవాటు టాలీవుడ్‌లో ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ....దొరితే దొంగలు, లేక పోతే దొరలే అన్న చందంగా రవితేజ సోదరులు పట్టుబడే వరకు భాగోతం బయటకు రాలేదు. ఇంకా దొరకని దొంగలు చాలా మందే ఉన్నారు.
ఆ సంగతి పక్కన పడితే ఇటీవల పట్టుబడిన డ్రగ్స్ ముఠా...యువ హీరో వరుణ్ సందేష్ పేరు బయట పెట్టింది. అయితే వరుణ్ మాత్రం తనకే పాపం తెలియదంటున్నారు. మరి వరుణ్ పై వచ్చిన ఆరోపణలు నిజమా? కాదా? అనే విషయాలు తేల్చే దిశగా విచారణ జరుపుతున్నారు. వరుణ్ డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్న తరుణంలో...ప్రస్తుతం ఆయనతో సన్నిహితంగా మెలగడానికి హీరోయిన్లు జంకుతున్నారు. అతనితో క్లోజ్ గా ఉంటే తమకూ డ్రగ్స్ అవాటు ఉన్నట్లు అనుమానిస్తారనో..? ఏమో గానీ వరుణ్ ను వీలైనంత దూరం పెడుతున్నారు.
డ్రగ్స్ కేసుకు ముందు అతనితో సన్నిహితంగా చెట్టా పట్టాలేసుకుని తిరిగిన శ్రద్ధదాస్...ఇప్పడు వరుణ్ వైపు చూడటమే మానేసింది. ఫోన్ చేసినా నోరెస్సాన్స్. వరుణ్ తరచు ఆమెను కాంటాక్ట్ కావడానికి ప్రయత్నిస్తుండటంతో తనను కలవొద్దు, ఫోన్ కూడా చేయొద్దు, నీతో తిరిగితే నేను ఇరుక్కునేలా ఉందనే అనుమానం వ్యక్తం చేస్తూ....తనకు దూరంగా ఉండమని వార్నింగ్ ఇచ్చిందట.


Click it and Unblock the Notifications