»   » పబ్లిక్‌గా భరితెగిస్తున్న కుర్ర హీరోయిన్లు

పబ్లిక్‌గా భరితెగిస్తున్న కుర్ర హీరోయిన్లు

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినిమా జీవితం వేరు...నిజ జీవితం వేరు. సినిమాల్లో చీరకట్టాల్సిన చోట బికినీ వేసినా, బికినీ వేయాల్సిన చోట చీరకట్టినా సన్నివేశం డిమాండ్ చేసిందని సరిపుచ్చుకోవచ్చు. కాని నిజ జీవితంలో అలా చేస్తే...బరి తెగింపు, సిగ్గులేనితనం అంటారు. ఇదే మాదిరి సినిమాకి, నిజ జీవితానికి తేడా తెలియకుండా పబ్లిక్‌గా బరితెగిస్తున్నారు కొందరు కుర్ర హీరోయిన్లు.

గత కొంత కాలంగా పరిస్థితి పరిశీలిస్తే...ఆడియో విడుదల కార్య్రక్రమాలు, సీని రంగానికి సంబంధించిన ఇతర కార్యక్రమాల్లో కొందరు హీరోయిన్లు మరీ ఎబ్బెట్టుగా కురచ దుస్తులతో దర్శనం ఇస్తూ తెగ హంగామా చేస్తున్నారు. తొడలపై వరకు అండర్ వేర్ కన్పించేలా దుస్తులేసుకొచ్చి మేమీ చూపిండం లేదనే చందంగా అందాలను దాచుకుంటున్నట్లు కిందకి మీదకి కాళ్లు మడతేసి మరీ కవరింగులు. వీళ్ల హడావుడికి సదరు కార్య్రకమానికి వచ్చిన వాళ్లంతా అసలు కార్యక్రమాన్ని వదిలేసి ....వీళ్ల వైపే కన్నార్పకుండా చూడటం లాంటి ఘటనలు కొన్నిసార్లు అనవసర న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నాయి.

దర్శకుల కళ్లలో పడి అవకాశాలు దక్కించుకోవాలనే ఆరాటమో? కనిపించిన ప్రతి ఒక్కరిని తమ అందాలకు దాసోహం చేసుకోవాలనే వెర్రితనమో ఏమోగానీ? అన్నీ వదిలేసి పబ్లిక్ గా బరితెగిస్తున్నారు. ఇలా చేస్తున్న వారంతా సెకండ్ గ్రేడ్ హీరోయిన్లు, పరిశ్రమకు కొత్తగా వచ్చిన వారే కావడం గమనార్హం.

హీరోయిన్ అంటే అందంగా ఉండాలి, అందాల ప్రదర్శన చేయాలి. సీని వినోదంలో అదో భాగం.కాదనడం లేదు.. కానీ దానికీ కొన్ని హద్దులున్నాయి. ఇలా పబ్లిక్‌గా బరి తెగిస్తే దక్కేవి అవకాశాలు కావు, చీదరింపులే.

English summary
Heroines exposing too much. They are creating nuisance in public Functions.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu