ఎన్టీఆర్ హీరోయిన్లతో బాలయ్య రొమాన్స్... ఇదేం కాంబినేషన్‌రా బాబు!
బాలయ్య బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవరసం లేదు. ఆయన పేరు.. థియేటర్లలో, పబ్బుల్లో, ఓ స్లోగన్ లా వినిపిస్తూ ఉంటుంది. అంతలా బాలయ్య బాబు.. అభిమానులకు దగ్గరయ్యాడు. ఇక ఈ మధ్య కాలంలో బాలకృష్ణ ఫుల్ ఫాంలో ఉన్నాడని చెప్పాలి. వరుస సినిమాలు చేస్తూ.. ఫుల్ జోష్ లో ఉన్నాడు. యంగ్ హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ.. బ్లాక్ బస్టర్ హిట్లు కొడుతున్నాడు. ఇక బాలయ్య.. తన తదుపరి సినిమాలో ఎన్టీఆర్ హీరోయిన్లతో రొమాన్స్ చేయనున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే...
ఫుల్ జోష్ లో బాలయ్య:బాలకృష్ణ.. అఖండ, వీరసింహారెడ్డి హిట్లతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. బుల్లితెరపై అన్ స్టాపబుల్ చేసి.. ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఈ షో కు ముందు బాలయ్య అంటే కోపిష్టి అని అనుకునే వారు. కానీ ఈ షో తర్వాత ఆయన సేవా గుణం, మాట తీరు భోళా శంకరుడని అందరికీ తెలిసింది. మొదటి సీజన్ సక్సెస్ కావడంతో.. రెండో సీజన్ కూడా చేశారు. అయితే ఆ షో కూడా సూపర్ హిట్ గా నిలిచింది. యంగ్ హీరోలకు గట్టి పోటీనిస్తూ.. ఆయన సినిమాలు చేస్తున్నాడు.

భగవంత్ కేసరిగా...:ప్రస్తుతం బాలకృష్ణ.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. భగవంత్ కేసరి అని ఇటీవల టైటిల్ రివిల్ చేయగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాలో కాజల్ ఆగర్వాల్, శ్రీలీల నటిస్తున్నారు. ఇక శ్రీలీల బాలకృష్ణ కూతురి పాత్రలో నటిస్తుందంటూ ప్రచారం జరుగుతోంది. ఇక ఈ సినిమా నుంచి రిలిజ్ అయిన పోస్టర్స్, టీజర్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

బాబీ దర్శకత్వంలో...:ఇక ఈ సినిమా తర్వాత బాలకృష్ణ బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. దీనికి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. ఎన్బీకే 109 పేరుతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవల ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం కూడా అయింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ కూడా రిలీజ్ చేయగా... మరో హిట్ ఖాయమని అభిమానులు ఫిక్స్ అయ్యారు. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.
ఇద్దరు గుమ్మలతో...:జూనియర్ ఎన్టీఆర్ తో రొమాన్స్ చేసిన హీరోయిన్లు.. బాలయ్యతో ఈ సినిమాలో చేయనున్నారు. వాళ్లేవరో కాదు.. నయనతార, రకుల్ ప్రీత్ సింగ్. ఎన్టీఆర్ తో ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు నటించారు. అదుర్స్ లో నయనతార నటించగా.. నాన్నకు ప్రేమతో చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. ఈ రెండు సినిమాలు ఎన్టీఆర్ కు మంచి హిట్ గా నిలిచాయి. ఇక బాబాయి సినిమా కూడా హిట్ అని అభిమానులు భావిస్తున్నారు.

గతంలో బాలయ్య నయనతార కాంబినేషన్లో వచ్చిన సింహా, శ్రీరామరాజ్యం, జై సింహా అన్ని హిట్ అయ్యాయి. ఇక ఇప్పుడు వీరి కాంబినేషన్లో నాలుగో సినిమా అవుతోంది. ఇక రకుల్‌ప్రీత్ సింగ్‌తో బాలయ్యకు ఇదే ఫస్ట్ సినిమా. బాబీ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో మాస్ మహారాజ్ రవితేజ కూడా నటిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ మూవీలో రవితేజ నెగిటివ్ షెడ్స్ ఉన్న పాత్రలో నటించనున్నారని సమాచారం.


Click it and Unblock the Notifications











