twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తెలుగు హీరోయిన్స్ స్పెషల్ నైట్ రేట్స్ (ఫోటో ఫీచర్)

    By Srikanya
    |

    హైదరాబాద్ : 2014 ఆశల పల్లకి ఎక్కి... కొత్త యేడాదిలోకి వచ్చేస్తున్నాం. మంచో, చెడో.. 2013 కొన్ని జ్ఞాపకాలు మిగిల్చింది. వాటిని నెమరువేసుకొంటూ.. నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టేస్తున్నాం. కొత్తేడాది సంబరాలు డిసెంబరు 31 రాత్రి నుంచీ ప్రారంభమైపోతున్నాయి. ఆ రోజు ఆ సంవత్సరానికి చివరి రోజు.. అందరికీ ప్రత్యేకమే.

    న్యూ ఇయిర్ వస్తోందంటే హీరోయిన్స్ కి భలే డిమాండ్. వారిలో ఎక్కువ డిమాండ్ సంపాదించి, ఎక్కువ డబ్బు డిమాండ్ చేస్తున్న కొద్దిమందే. మిగతావాళ్లు..ఇచ్చింది పుచ్చుకుని డాన్స్ చేసి తప్పుకునేవాళ్ళే.

    కొత్త సంవత్సరం వస్తుందంటే అందరికీ హుషారే. అందులోనూ సెలబ్రెటీల లైఫ్ మరీను. డిసెంబర్ 31 రోజు రాత్రిని వారు చాలా గ్రాండ్ గా జరుపుకోవటానికి ప్లాన్ చేసుకుంటూంటారు. మరి మన తెలుగు సినిమా ముద్దుగుమ్మలు...ఆ రోజు రాత్రి ఎక్కడ గడిపబోతున్నారు? ఏం చేస్తారు? వారు తీసుకునే రెమ్యునేషన్ ఎంత? అందరికీ ఆసక్తే.

    గమనిక: క్రింద చెప్పబడ్డ హీరోయిన్స్...న్యూ ఇయిర్ సెలబ్రేషన్స్ రేట్స్ ..ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతున్నవే కానీ...అధికారకమైనవి కావు.

    ఏ హీరోయిన్...ఎంతెంత...స్లైడ్ షోలో...

    ప్రియమణి

    ప్రియమణి

    ఒక్క రాత్రికి పాతిక లక్షలు డిమాండ్ చేసింది. ఆ రాత్రే డిసెంబర్ 31 రాత్రి. రానున్న నూతన సంవత్సర వేడుకలలో ప్రియమణి డాన్స్ చేయడానికి ఒప్పుకుందట. ఆ రోజు రాత్రి డాన్స్ చేసినందుకు ఆమెకు ముట్టచెప్పాల్సిన పారితోషికం అక్షరాలా 25 లక్షలు. ఓ కార్పోరేట్ సంస్ధ ఈ డాన్స్ పోగ్రామ్ నిర్వహిస్తోంది. ఒకేసారి తన రేటును ఇంత చెప్పేసరికి భయపడిపోయిన నిర్వాహకులు చిట్టచివరికి బేరం ఖరారు చేసుకున్నారని సమాచారం. సినిమాలు రాకపోయినా ఇలాంటి డాన్స్ కార్యక్రమాలు రెండు మూడు వచ్చినా చాలు, ప్రియమణి డైరీ ఫుల్ అయిపోతుంది. సినిమాలెటూ లేవు కదా అని డాన్స్‌లు చేయమని అడిగేవారు కూడా పెరిగిపోయారట. ఎలాగైతేనేం సమయాన్ని వృధా కాకుండా ఏదో విధంగా డాన్స్‌లో, నటనో చేస్తోంది కదా ఈ ఉత్తమ నటి అని ఫిల్మ్ ఇండస్ట్రీలో వారు కామెంట్స్ చేస్తున్నారు.

    ఛార్మి

    ఛార్మి

    వరస ఫ్లాపుల్లో ఉన్న ఛార్మి డాన్స్ లకు మాత్రం డిమాండ్ తగ్గలేదు. ఆమె న్యూ ఇయిర్ సెలబ్రేషన్స్ లో భాగంగా హైదరాబాద్ లో ఓ నైట్ డాన్స్ చేయటానికి ఒప్పందం కుదుర్చుకుందని సమాచారం. అందునిమిత్తం ఆమె 18 లక్షలు తీసుకుంటోందని సమాచారం.

    హంసా నందిని

    హంసా నందిని

    ప్రభాస్ ‘మిర్చి' సినిమాలో మిర్చి లాంటి కుర్రాడు అంటూ ఘాటైన ఎర్రమిరప కాయల మధ్య హాట్ అండ్ సెక్సీ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన నటి హంసా నందిని తాజాగా తన అందాల సోయగాలను విజయవాడ హ్యాయ్ లాండ్ లో... న్యూ ఇయిర్ సెలబ్రేషన్స్ జరుపుకోనుంది. అక్కడ ఆమె డాన్స్ చేయనుందని సమాచారం. అందునిమిత్తం ఏడు నుంచి ఎనిమిది లక్షలు వసూలు చేస్తోందని తెలుస్తోంది.

    రచనా మౌర్య

    రచనా మౌర్య

    తెలుగు సినిమాల్లో ఐటం సాంగ్స్ చేసే రచనా మౌర్యకు ఈ న్యూయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా చాలా బిజీగానే ఉంది. ఆమెకు ఈ సెలబ్రేషన్స్ లో భాగంగా జరిగే నైట్ కు..ఐదు లక్షలు వరకూ పే చేస్తున్నారని సమాచారం.

    ముమైత్ ఖాన్

    ముమైత్ ఖాన్

    ఒకప్పుడు ఐటం సాంగులతో దక్షిణాది సినీ ప్రేక్షకులను ఊర్రూతలూగించిన ముమైత్ ఖాన్ ఈ మధ్య జోరు కాస్త తగ్గించిన విషయం తెలిసిందే. సెక్సీ ఒంపు సొంపులతో, కైపెక్కించే ఒయ్యారాలతో శృంగార ప్రియులకు నిద్రలేకుండా చేసిన ఈ భామ మళ్లీ న్యూ ఇయరి సెలబ్రేషన్ తో షేక్ చేసేందుకు రెడీ అవుతోంది. హైదరాబాద్ ఎఫ్ ఎన్ సిసి లో ఆమె డాన్స్ చేయనుందని తెలుస్తోంది. ఇందు నిమిత్తం ఆమె పది లక్షలు వరకూ డిమాండ్ చేసి వసూలు చేస్తోందని తెలుస్తోంది.

    మధురిమ

    మధురిమ

    ‘ఆ..ఒక్కడు' చిత్రం ద్వారా హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమైన మధురిమ ఆ తర్వాత అల్లరి నరేష్ హీరోగా వచ్చిన ‘సరదాగా కాసేపు' చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత రాజశేఖర్ హీరోగా వచ్చిన ‘మహంకాళి', వెంకటేష్ హీరోగా వచ్చిన ‘షాడో' చిత్రంలో శ్రీకాంత్ సరసన అవకాశం దక్కించుకున్నా ఆ సినిమా ఫట్ మనడంతో అమ్మడుకి పెద్దగా కలిసి రాలేదు. ప్రస్తుతం అవకాశాల కోసం పడిగాపులు కాస్తున్న భామల లిస్టులో మధురిమ కూడా చేరి పోయింది. ఆమె తాజాగా న్యూ ఇయిర్ సెలబ్రేషన్స్ కి డాన్స్ చేయటానికి కమిటైంది. అందు నిమిత్తం మూడు లక్షలు వరకూ వసూలు చేసిందని తెలుస్తోంది.

    శ్రద్దా దాస్

    శ్రద్దా దాస్

    రేయ్ చిత్రంతో మళ్లీ వార్తల్లోకి వచ్చిన ముద్దుగుమ్మ శ్రద్దా దాస్. ఆమె న్యూ ఇయిర్ సెలబ్రేషన్ లో ఒక రాత్రికి డాన్స్ చేయటానికి ఐదు లక్షలు వసూలు చేస్తోందని సినీ వర్గాల సమాచారం.

    సంజన

    సంజన


    బుజ్జిగాడు మేడిన్ చెన్నై చిత్రంలో తన క్యూట్ పెర్ఫార్మెన్స్‌తో మంచి మార్కులే కొట్టేసింది. ఆ తర్వాత సత్యమేవ జయతే, సమర్థుడు, పోలీస్, దుశ్శాసన, ముగ్గురు, యమహోయమ, జగన్ చిత్రాల్లో నటించిన సంజనకు ఒక్క హిట్టూ దక్కక పోవడంతో ఆమెకు అవకాశాలు లేకుండా పోయాయి. ఆమె న్యూ ఇయిర్ సెలబ్రేషన్ లో ఒక రాత్రికి డాన్స్ చేయటానికి 16 లక్షలు వసూలు చేస్తోందని సినీ వర్గాల సమాచారం. ఈ పోగ్రాం బెంగుళూరులో జరగనుంది.

    పూనమ్ కౌర్

    పూనమ్ కౌర్

    మాయాజాలం వంటి చిత్రంతో పరిచయమై వినాయకుడు తో పాపులర్ అయిన పూనం కౌర్ కి కలసిరాక పోవటంతో అలా మిగిలిపోయింది. రీసెంట్ గా ఆడు మగాడ్రా బుజ్జి చిత్రంలోనూ ఆమె మెరిసింది. అయితే చిత్రం పెద్ద వర్కవుట్ కాకపోవటంతో మళ్లీ మొదటి కొచ్చింది. ఆమె న్యూ ఇయిర్ సెలబ్రేషన్ లో ఒక రాత్రికి డాన్స్ చేయటానికి 12 నుంచి 15 లక్షలు వసూలు చేస్తోందని సినీ వర్గాల సమాచారం.

    రకుల్ ప్రీతి సింగ్

    రకుల్ ప్రీతి సింగ్

    రకుల్ ప్రీతి సింగ్ అంటే మరెవరో కాదు...వెంకటాద్రి ఎక్సప్రెస్ లో హీరోయిన్ గా చేసిన అమ్మాయి. సందీప్ కిషన్ హీరోగా వచ్చిన ఆ చిత్రం మంచి విజయమే సాధించింది. ఆమెను పవన్ తర్వాత తను చేయబోయే గబ్బర్ సింగ్ సీక్వెల్ లో తీసుకుంటున్నాడని సమాచారం. అయితే ఆమె న్యూ ఇయిర్ సెలబ్రేషన్ లో ఒక రాత్రికి డాన్స్ చేయటానికి 10 నుంచి 15 లక్షలు వసూలు చేస్తోందని సినీ వర్గాల సమాచారం.

    రెజీనా

    రెజీనా


    'ఎస్‌.ఎమ్‌.ఎస్‌', చిత్రంతో పరిచయమైన రెజీనా మొదటి చిత్రంతోనే మంచి మార్కులు కొట్టేసింది. తర్వాత 'రొటీన్‌ లవ్‌స్టోరీ' చిత్రాల్లో నటించిందీ భామ. ప్రస్తుతం చిరంజీవి మేనల్లుడు సాయిధర్మతేజ్‌ హీరోగా గీతా ఆర్ట్స్‌ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా రెజీనాను ఎంపిక చేశారు. ఆమె న్యూ ఇయిర్ సెలబ్రేషన్ లో ఒక రాత్రికి డాన్స్ చేయటానికి 10 లక్షలు వసూలు చేస్తోందని సినీ వర్గాల సమాచారం.

    కామ్నా జట్మలాని

    కామ్నా జట్మలాని

    రణం చిత్రంలో గోపీచంద్ ప్రక్కన చేసిన కామ్నా జట్మలాని తర్వాత అల్లరి నరేష్ తో రెండు చిత్రాలు చేసింది. రీసెంట్ గా భాయ్ లో మెరిసింది. కానీ ఆమె కెరీర్ అనుకున్నంత వేగంగా ముందుకు వెల్లటం లేదు. ఆమె న్యూ ఇయిర్ సెలబ్రేషన్ లో భాగంగా ఏర్పాటు చేసిన పోగ్రాంలో ఒక రాత్రికి డాన్స్ చేయటానికి 5 లక్షలు వసూలు చేస్తోందని సినీ వర్గాల సమాచారం. పోగ్రాం కరీం నగర్ లో ఉండబోతోందని సమాచారం.

    English summary
    It’s quite common that every heroine in Industry earns money on New year party’s.Mean while they appear in partys and some of them will give dance performances too.The remuneration will depend upon their craze in public.Some of the heroines remuneration as follows below.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X