ఆ విషయంలో కీర్తి సురేష్ తప్పు చేస్తుందా? ఆ సీన్స్ కోసం రష్మికతో పోటీకి మహనటి రెడీ?
ఇప్పుడు సౌత్ సినిమా నుంచి పలువురు స్టార్ హీరోలు పాన్ ఇండియా మార్కెట్ లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకుంటూ వెళ్తున్నారు. తెలుగు, తమిళ్, కన్నడ నుంచి చాలా మంది స్టార్స్ నార్త్ మార్కెట్ పై కన్నేసి ఒకో సినిమాతో ఒకో అడుగు వేస్తున్నారు. అయితే వీరితో తాము కూడా తక్కువ కాదు అని కొందరు స్టార్ హీరోయిన్స్ కూడా బాలీవుడ్ మార్కెట్ పై కన్నేశారు. ఈ విషయంలో కీర్తీ సురేష్ అనుసరిస్తున్న స్ట్రాటెజీ ఏంటో తెలుసా?
అయితే వీరిలో స్టార్ హీరోయిన్స్ రష్మికా మందన్నా ఇంకా కీర్తి సురేష్ లు అయితే ప్రధానంగా ఫోకస్ అవుతున్నారని చెప్పాలి. కాగా సౌత్ లో కన్నడ ఇండస్ట్రీ నుంచి కెరీర్ స్టార్ట్ చేసినప్పటికీ నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కి మన తెలుగు ఇండస్ట్రీనే పెద్ద బ్రేక్ ఇచ్చింది. కాగా ఇందులో అయితే అల్లు అర్జున్ తో చేసిన పుష్ప సినిమాతో రష్మిక కి పాన్ ఇండియా క్రేజ్ వచ్చింది.

అలా హిందీ మార్కెట్ లో కూడా ఈమె సినిమాలు చేస్తుండగా ఒక పాజిటివ్ వైబ్స్ తో అయితే రష్మికా మందన్నా దూసుకెళ్తుంది. ఇప్పటికే "ఆనిమల్" సినిమాతో బాలీవుడ్ లో పాగా వేసిన రష్మిక హిందీలో మిషన్ మజ్ను, గుడ్ బాయ్, ఇపుడు స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో సికందర్ అనే భారీ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇక దీనితో పాటుగా మరో సినిమా "వాంపైర్ ఆఫ్ విజయనగర్" అనే హారర్ థ్రిల్లర్ లో కూడా నటించేందుకు ఓకే చేసింది అని వినిపిస్తుంది.
ఇలా వరుస ప్రాజెక్ట్ లతో రష్మికా బిజీగా ఉంది. కానీ కీర్తి సురేష్ మాత్రం తన మొదటి సినిమా రిలీజ్ కే స్ట్రగుల్ అవుతుంది అని చెప్పాలి. ఆమె తమిళ హిట్ చిత్రం విజయ్ నటించిన "థెరీ" రీమేక్ తో ఎంట్రీ ఇవ్వబోతుంది. అయితే ఈ సినిమాతో ఇచ్చే బాలీవుడ్ ఎంట్రీ పై ఆమె చాలా నమ్మకం పెట్టుకుంది.

పైగా ఈమె ఈ సినిమా కోసం బోల్డ్ సీన్స్ కోసం కూడా నో చెప్పలేదని కొన్ని రూమర్స్ ఉన్నాయి. అన్నట్టు ఈ సినిమా "బేబీ జాన్" పేరిట వరుణ్ ధావన్ హీరోగా చేస్తున్నారు. అయితే ఈ సినిమా ఇప్పటికే పలు మార్లు వాయిదా పడుతూ వచ్చి ఈ సమ్మర్ లో రిలీజ్ కావాల్సింది కాస్త ఏకంగా ఈ ఏడాది చివరికి వెళ్ళిపోయింది. దీనితో ఈమె డెబ్యూ మాత్రం ఒకింత నెగిటివ్ గానే వెళుతుంది అని చెప్పాలి.
పైగా బాలీవుడ్ లో కూడా ఇప్పుడు రీమేక్ సినిమాలకి పెద్దగా వాల్యూ కనిపించడం లేదు. రీసెంట్ గా వచ్చిన ఏ రీమేక్ కూడా బాలీవుడ్ లో సరిగ్గా పెర్ఫామ్ చేసింది లేదు. దీనితో ఈ సినిమాకి ఏమాత్రం కొంచెం అటు ఇటు అయినా ఆమె బాలీవుడ్ ఎంట్రీ అనుకున్న రేంజ్ లో జరగకపోవచ్చనే చెప్పాలి. మరి ఇలా ఓ రీమేక్ సినిమా కాకుండా స్ట్రైట్ సినిమా చేసుకున్నా బాగుణ్ణు అని మహానటి అభిమానులు అనుకుంటున్నారు. మరి కీర్తి సురేష్ ఎలాంటి ఎంట్రీ అందుకుంటుందో ఈ ఏడాది డిసెంబర్ 25 వరకు ఆగి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











