Sreeleelaకు ఆ కోరిక ఉండిపోయిందట.. అది తీర్చేవాడు కావాలట.. అబ్బో పెద్ద కోరికే!
'పెళ్లి సందడి' సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన కన్నడ కస్తూరి శ్రీలీల. అలా అడుగుపెట్టింది రెండు సినిమాలు చేసింది. అంతే ఇక ఏ హీరోయిన్ అందుకోని రేంజ్ లో అవకాశాలు అందుకుని లక్కీ హీరోయిన్ గా డబ్బు. ఫేమ్, స్టార్ స్టేటస్ అన్నీ తక్కువ సమయంలోనే సంపాదించుకుంది. అయితే ఈ అమ్మడుకు ఓ కోరిక మాత్రం ఉండిపోయిందట. దాన్ని తీర్చివాడు ఎవరైనా ఉన్నారా అని అడుగుతోంది. ఇంతకీ అదేంటో చూద్దాం...
లక్కీ హీరోయిన్ గా...: రాఘవేంద్రరావు దర్శకత్వంలో పెళ్లిసందడి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన క్యూట్, స్వీట్ హీరోయిన్ శ్రీలీల. అందం, అభినయంను జేబులో పెట్టుకుని వచ్చింది. అంతే రెండేళ్లలో పదికి పైగా సినిమాలను ఒకే సారి చేస్తోంది. ఇదొక్కటి చాలు ఆమె ఎంతటి అదృష్టపంతురాలో చెప్పడానికి. ప్రస్తుతం ఇండస్ట్రీలో యమా జోరు చూపిస్తోంది. ఇప్పుడంతా ఈమె కోసమే స్టార్ హీరోలు ఆరాటపడుతున్నారు.

ఏకంగా పది సినిమాలు...: మహేశ్ బాబుతో గుంటూరు కారం, పవన్ కల్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్, బాలకృష్ణతో భగవంత్ కేసరి, పంజా వైష్ణవ్ తేజ్ తో ఆదికేశవ, బోయపాటి రామ్ పోతినేని సినిమా, నితిన్ 32 సినిమా,గుంటూరు కారం, విజయ్ దేవరకొండ 12, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలలో నటిస్తోంది. .అలానే మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమాలో శ్రీలీలను తీసుకోబోతున్నారని ప్రచారం సాగుతోంది. తనకు హిట్ అందించిన ధమాకా హీరో రవితేజతోనూ మరోసారి సినిమా చేయబోతుందని వార్తలు వచ్చాయి.
రోజుకో వార్త.. :మరి ఇంతటి ఫేమ్ ఉన్న శ్రీలీల ఎవరు మాత్రం వదలుతారు. సోషల్ మీడియాలోనూ అన్నీ ఈమె గురించే. శ్రీలీల ఇష్టఇష్టాలు ఏంటి ఏం తింటుంది ఏం చేస్తుంది ఎక్కడ ఉంటుంది బ్యాక్ గ్రౌండ్ ఏంటి ఆమె కోరికలు ఏంటి ఇలా తనకు సంబంధించిన ఏదో ఒక వార్త రోజూ బయటకు వస్తూనే ఉంటాయి. అవి నెట్టింట్లో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. అయితే తాజాగా మరో న్యూస్ బయటకు వచ్చింది.

అదేంటంటే.. :ఇప్పుడు శ్రీలీల ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అనేది ప్రస్తుతం బయటకు వచ్చింది. శ్రీలీలకు ఫస్ట్ నుంచి మహానటి సావిత్రి అంటే చాలా ఇష్టమట. ఆ తర్వాత సౌందర్య అంటే మహా మహా ఇష్టమట. ఇక ప్రస్తుతం హీరోయిన్స లో సాయి పల్లవి అంటే తన ఫేవరెట్ అని తెలిసింది. అందరి ఆడియెన్స్ లానే తనకు కూడా సాయి డ్యాన్స్ అంటే ఎక్కువ ఇష్టమట. అందుకే సాయి పల్లవి తో కలిసి ఒక్క సినిమాలో అయినా నటించాలని ఆశపడుతుందట ఈ అమ్మడు. చూద్దాం మరి ఈ అందాల ముద్దుగుమ్మ కోరికను ఏ దర్శకుడు తీరుస్తాడో?


Click it and Unblock the Notifications











