twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిజమేనా? : ‘బాహుబలి’ క్లైమాక్స్ లెంగ్త్... ఖర్చు

    By Srikanya
    |

    హైదరాబాద్ : ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ‘బాహుబలి' సినిమా జూలై 10న భారీ ఎత్తున విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో చిత్రం గురించి ఆసక్తి అంతటా మొదలైంది. అనేకమైన వార్తలు,రూమర్స్ వస్తున్నాయి. అందులో ఒకటి ఈ చిత్రం క్లైమాక్స్ ఖర్చు గురించి. ఈ చిత్రం క్లైమాక్స్ 40 నిముషాలు ఉండనుంది. దాదాపు 20 కోట్లు వరకూ బడ్జెట్ కేవలం ఈ ఎపిసోడ్ మీదే పెట్టినట్లు చెప్పుకుంటున్నారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    మరో ప్రక్క ఈ చిత్రం బిజినెస్ జోరందుకుంది. లెటెస్ట్ గా...బాలకృష్ణతో లెజండ్ నిర్మించిన స్టార్ ప్రొడ్యూసర్ సాయి కొర్రిపాటి చేతికి ‘బాహుబలి' రైట్స్ వెళ్లాయి. రాజమౌళి సన్నిహితుడైన సాయి కొర్రపాటి బాహుబలి కర్ణాటక డిస్ట్రిబ్యూషన్ హక్కులను పొందారు. ‘బాహుబలి'అన్ని వర్షన్‌లనూ ఆయనే కర్ణాటకలో విడుదల చేయనున్నారు. కర్ణాటక డిస్ట్రిబ్యూషన్ హక్కులు కూడా మంచి ధరకు అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది.

    ఇక ఈ వేడుకతో,అంతకు ముందు వదిలిన ట్రైలర్ తో ఈ చిత్రానికి ఓ రేంజిలో క్రేజ్ వచ్చింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఓవర్ సీస్ రైట్స్ ని కి విపరీతమైన క్రేజ్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.

    High budget for Bahubali climax

    USA థియోటర్ రైట్స్ ని తొమ్మిది కోట్లకు అంతుకు ముందే కొనుగోలు చేసిన బయ్యర్ 12 కోట్లు కు తిరిగి రీజనల్ డిస్ట్రిబ్యూటర్లకు అమ్మేసినట్లు తెలుస్తోంది. అంటే 2.4 మిలియన్ డాలర్లుకు అన్నమాట. దానర్దం సినిమా రిలీజ్ కు ముందే మూడు కోట్లు లాభం చూసారన్నమాట. ఇంకా ఇలా ఎంతమందికి ఈ చిత్రం డబ్బులు పంట పండించనుందో అని అంతా ఎదురుచూస్తున్నారు.

    ప్రస్తుతం యావత్ భారతదేశ సినీ పరిశ్రమ కళ్ళన్నీ బాహుబలి చిత్రం వైపే వున్నాయి. ఈ సినిమా దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి బాహుబలి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపాడు.

    ఈ భారీ బడ్జెట్ చిత్రానికి మహాభారతమే తనకు స్పూర్తినిచ్చిందని తెలిపాడు. ఇదేకాదు దాదాపు తన సినిమాలన్నిటికీ రామాయణ, మహాభారతాలే స్పూర్తని చెప్పుకొచ్చాడు. ఈ రెండు ఇతిహాసాలతో తనకున్న అనుబంధమే దీనికి కారణమని తెలియజేసాడు. బాహుబలి పార్ట్ 1 జులై 10న మనముందుకు రానుంది. బాలీవుడ్ లో కరణ్ జోహార్ సమర్పిస్తున్న ఈ సినిమాను ఆర్కా మీడియా వర్క్స్ సంస్థ నిర్మిస్తుంది.

    భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యంత భారీ వ్యయంతో రూపొందుతున్న చిత్రం 'బాహుబలి'. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి భాగం 'బాహుబలి - ది బిగినింగ్‌' పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

    ఈ చిత్రంలో ప్రభాస్‌, అనుష్క, తమన్నా, రానా ఇతర ముఖ్య పాత్రధారులు. ప్రసాద్‌ దేవినేని, శోభు యార్లగడ్డ నిర్మాతలు. కె.రాఘవేంద్రరావు సమర్పకుడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు అంతర్జాలంలో మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రాన్ని వచ్చే నెల 10న విడుదల చేస్తున్నారు. కీరవాణి సంగీతం అందించారు.

    English summary
    Climax of “BAHUBALI’ is going to be as long as 40 mins, reportedly. Producers spent 20 crores on climax sequences.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X