రామ్ చరణ్ ఆరెంజ్ గురించి చిత్రమైన న్యూస్
రామ్ చరణ్, భాస్కర్ కాంబినేషన్ లో రూపోందిన ఆరెంజ్ చిత్రం భాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి రీమేక్ రైట్స్ కి మంచి పోటీ ఏర్పడినట్లు చెప్తున్నారు.ముఖ్యంగా తమిళంలో చేయటానికి ధనుష్ ఆసక్తి చూపి, రైట్స్ కోసం ఎంక్వైరీ చేసారని, అలాగే కన్నడంలో ముంగారమలై ఫేమ్ గణేష్ కూడా ఈ చిత్రాన్ని కొద్ది పాటి మార్పులతో చేస్తే వర్కవుట్ అవుతుందని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నారు. ఇక ఈ రీమేక్ రైట్స్ గురించి వినపడ్డాక నిర్మాత నాగబాబు కాస్త తెరిపిన పడ్డట్లు, అలాగే రామ్ చరణ్ కూడా హ్యాపీ ఫీలయినట్లు ఫిల్మ్ నగర్ సమాచారం.
బొమ్మరిల్లు భాస్కర్ అయితే నేను మొదటినుంచి చెప్తూనే ఉన్నాను..ఆ స్క్రిప్టు లో స్టఫ్ ఉంది, నా మీద కామెంట్స్ చెయ్యటం కన్నా పబ్లిసిటీ మీద దృష్టిపెడితే చిత్రం నిలబడేది అంటున్నాట్ట.అయితే కొందరు సీనియర్స్ మాత్రం ఈ రీమేక్ రైట్స్ అనేది పబ్లిసిటీ స్టంట్ లో ఓ భాగమే అని కొట్టిపారేస్తున్నారు. అదీ సంగతి.


Click it and Unblock the Notifications











