RAPO20: గూస్ బంప్స్ తెప్పించే ఫైట్ సీన్.. ఏకంగా 11 రోజులు.. ఖర్చు ఎంతో తెలుసా?

దేవదాసు సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన రామ్ పోతినేని ఎనర్జిటిక్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. తనదైన స్టైల్ లో సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. హిట్లు, ఫ్లాప్ లు అంటూ తేడా లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. తాజాగా రామ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న మూవీలో హీరోగా చేస్తున్నాడు.

ఇక బోయపాటి శ్రీను సినిమాల్లో హీరోలకు ఎలాంటి ఎలివేషన్స్ ఉంటాయో తెలిసిందే. ఇప్పుడు రామ్ పోతినేనితో కూడా ఒక అదిరిపోయే సన్నివేశాన్ని చిత్రీకరించాడట ఈ డైరెక్టర్. ఈ సీన్ సినిమాకే హైలెట్ కానుందని టాక్ వినిపిస్తోంది. మరి ఆ విశేషాల్లోకి పూర్తిగా వెళితే..

ప్రారంభంలోనే హిట్లు..

ప్రారంభంలోనే హిట్లు..

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోలు వారసులుగా ఎంట్రీ ఇచ్చారు. అందులో కొందరు మాత్రమే స్టార్లుగా ఎదిగి స్టార్ డమ్ సంపాదించుకున్నారు. అలాంటి వారిలో ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిశోర్ ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయమైన రామ్ పోతినేని ఒకరు. వైవీఎస్ చౌదరి దర్శకత్వం వహించిన 'దేవదాసు' అనే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ ఆరంభంలోనే పలు హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.

పూర్తి స్థాయిలో మాస్ ఇమేజ్..

పూర్తి స్థాయిలో మాస్ ఇమేజ్..

సినీ కెరీర్ స్టార్టింగ్ లోనే దేవదాస్ తర్వాత జగడం, రెడీ, మస్కా వంటి చిత్రాల్లో హ్యాండ్సమ్ లుక్స్, డ్యాన్స్, ఫైట్స్ ఇలా అన్నింట్లోనూ రాణించాడు. శీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన రెడీ సినిమా అప్పట్లో ఎంతగా హిట్ అయిందో తెలిసిందే. ఓవైపు లవర్ బాయ్ గా ఉన్న కథలు చేస్తూనే మరోవైపు మాస్ హీరోగా తనను తాను చూపించుకునే ప్రయత్నం చేశాడు రామ్. అందులో కొంతవరకు సక్సెస్ అయిన పూర్తి స్థాయిలో మాస్ ఇమేజ్ తీసుకొచ్చింది ఇస్మార్ట్ శంకర్.

డిజాస్టర్ టాక్..

డిజాస్టర్ టాక్..

మాస్, క్లాస్ చిత్రాలు చేసుకుంటు వెళ్లిన రామ్ పోతినేని గతేడాది ది వారియర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో వచ్చిన ఈ బైలింగువల్ మూవీ డిజాస్టర్ టాక్ అందుకుంది. ఇప్పుడు ఈ ఎనర్జీటిక్ స్టార్ మాస్ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న రామ్ లేటెస్ట్ మూవీ RAPO20. ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు.

దసరా కానుకగా..

దసరా కానుకగా..

రామ్ పోతినేని సినీ కెరీర్ లోనే తొలి సారిగా పాన్ ఇండియా మూవీగా వస్తున్న RAPO20కు తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక రామ్ సరసన బ్యూటిఫుల్ అండ్ డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల హీరోయిన్ గా చేస్తోంది. ఇక ఈ సినిమాలో పవర్ ఫుల్ విలన్ పాత్రలో యంగ్ హీరో ప్రిన్స్ సిసిల్ ను ఓకే చేసినట్లు సమాచారం. అలాగే ముద్దుగుమ్మ మీరా జాస్మిన్ ఈ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయనునందని టాక్. ఇటీవలే ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేయనున్నారు.

 హై రేంజ్ ఎలివేషన్స్..

హై రేంజ్ ఎలివేషన్స్..

RAPO20 సినిమాను అక్టోబర్ 20న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ లో రామ్ పోతినేని వీర మాస్ లుక్ లో దర్శనం ఇచ్చాడు. పోట్ల గిత్తను పట్టుకుని లాక్కుని రామ్ వెళ్తున్న ఈ పోస్టర్ అదిరిపోయింది. అయితే ఈ పోస్టర్ ఈ సినిమాలోని బుల్ ఫైటింగ్ సీన్ లోనిది అని సమాచారం. బోయపాటి తన సినిమాల్లో హీరోలకు హై రేంజ్ ఎలివేషన్స్ ఇచ్చే ఫైటింగ్ సీన్లు తెరకెక్కించడంలో సిద్ధహస్తుడు.

11 రోజులు.. 28 జనరేటర్లు..

11 రోజులు.. 28 జనరేటర్లు..

RAPO20లో కూడా రామ్ పోతినేనితో భారీ బుల్ ఫైట్ సీన్ ను తెరకెక్కించారట బోయపాటి. దీనికోసం ఏకంగా 11 రోజులు షూటింగ్ చేశారట. అందుకోసం భారీగా ఖర్చు అయిందని టాక్. నిర్మాత శ్రీనివాసా చిట్టూరి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ ఫైట్ సీన్ నిర్మించారట.

అంతేకాకుండా హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ స్టూడియోలో చిత్రీకరించిన బుల్ ఫైటింగ్ యాక్షన్ సీక్వెన్స్ కోసం భారీ లైట్స్ ఉపయోగించారట. అందుకు 28 జనరేటర్లు, పవర్ లైట్స్ అవసరం అయ్యాయని టాక్. అవికూడా బయటి నుంచి తెప్పించారట. ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే హైలెట్ గా నిలవనుందని సినీ వర్గాల నుంచి సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X