అల్లు అర్జున్, రష్మిక‌కు టాప్ రెమ్యునరేషన్.. పుష్ప జోడికి పారితోషికం ఎన్ని కోట్లంటే?

ప్రస్తుతం తెలుగు సినిమా స్థాయి మారిపోయింది. ఒకప్పుడు తెలుగు సినిమాలు ప్రాంతీయ మార్కెట్‌కే పరిమితమయ్యేవి. కానీ, ఇప్పుడు పాన్-ఇండియా స్థాయిలోనూ హవా కొనసాగిస్తున్నాయి. భారీ బడ్జెట్ సినిమాలు, ప్రపంచవ్యాప్తంగా కోట్ల కలెక్షన్లు, అంతర్జాతీయ మార్కెట్ లో తెలుగు స్టార్‌లకు డిమాండ్ ఏర్పడింది. దీంతో స్టార్ హీరోలు, హీరోయిన్ల కూడా రికార్డు స్థాయిలో రెమ్యూనరేషన్‌ అందుకుంటున్నారు. ఇంతకీ టాలీవుడ్‌లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఆ హీరో, హీరోయిన్ ఎవరు? వారు ఒక్క సినిమాకు ఎంత పారితోషికం తీసుకుంటున్నారు?

గత పది సంవత్సరాల్లో తెలుగు సినిమా పాన్-ఇండియా స్థాయిలో బాలీవుడ్‌కు సవాల్ విసిరే స్థాయికి ఎదిగింది. భారీ బడ్జెట్ సినిమాలు, ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు సాధిస్తున్న కథలు, అంతర్జాతీయ మార్కెట్ విస్తరణతో టాలీవుడ్ విలువ గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా 'బాహుబలి', 'ఆర్‌ఆర్‌ఆర్', 'పుష్ప' వంటి చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టించడంతో తెలుగు సినిమాలపై ప్రపంచ దృష్టి పడింది. ఈ విజయాల ప్రభావం టాలీవుడ్ స్టార్‌ల రెమ్యూనరేషన్‌లపై కూడా స్పష్టంగా కనిపిస్తోంది.

Highest Paid Telugu Hero and Heroine 2026 Allu Arjun Rashmika Mandanna Remuneration

టాలీవుడ్‌లో హైయెస్ట్ పెయిడ్ హీరో
ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోగా అల్లు అర్జున్ పేరు ముందుంటోంది. 'పుష్ప: ది రైజ్'తో దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ సంపాదించిన ఆయన, 'పుష్ప 2: ది రూల్'తో మరింత క్రేజ్ పెరిగింది. ఈ సినిమా భారీ వసూళ్లు సాధించడంతో ఆయన మార్కెట్ విలువ కూడా భారీ పెరిగింది. సమాచారం ప్రకారం.. ప్రస్తుతం అల్లు అర్జున్ ఒక్కో సినిమాకు సుమారు రూ. 200 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

'పుష్ప 2' విషయంలో ఆయన సాధారణ రెమ్యూనరేషన్ తీసుకోకుండా ప్రాఫిట్ షేరింగ్ మోడల్ ఎంచుకున్నారని సమాచారం. ఈ చిత్ర లాభాల్లో దాదాపు 27 శాతం వాటా ఆయనకు దక్కినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పుష్ప 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో ఆయనకు సుమారు రూ. 270 కోట్ల వరకు ఆదాయం వచ్చిందని అంచనా. దీంతో అల్లు అర్జున్ ప్రస్తుతం దేశంలోనే అత్యంత ఖరీదైన నటుల్లో ఒకరిగా నిలిచారు.

ఇక ఆయన రాబోయే ప్రాజెక్టులు కూడా భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్నాయి. దర్శకుడు అట్లీ కుమార్ తెరకెక్కిస్తున్న 'AA22XA6' సినిమాలో ఆయన నటిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటించనున్నట్లు సమాచారం. ఈ సినిమాకు అల్లు అర్జున్ రూ.175 కోట్ల రెమ్యునరేషన్ తో పాటు లాభాల్లో వాటా కూడా తీసుకోబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మరోసారి భారీ విజయాలు సాధిస్తాయని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్
హీరోయిన్లలో ప్రస్తుతం అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్ గా రష్మిక మందన్న నిలిచినట్టు తెలుస్తోంది. ఈ అమ్మడు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు వరుస విజయాలతో తన క్రేజ్‌ను పెంచేసుకుంది. ఎవరూ ఊహించని విధంగా భారీ పాలోయింగ్ సంపాదించుకుంది. ముఖ్యంగా యానిమల్, పుష్ప 2, ఛావా వంటి సినిమాల విజయాలతో ఆమెకు దేశవ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. సమాచారం ప్రకారం.. ప్రస్తుతం రష్మిక మందన్న ఒక్కో సినిమాకు సుమారు రూ.10 కోట్ల నుంచి రూ.13 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారని తెలుస్తోంది. సాధారణ చిన్న సినిమాల కోసం ఆమె ఫీజు రూ. 4 కోట్ల నుంచి రూ.8 కోట్ల వరకు ఉండొచ్చని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

ఇక రష్మిక అప్ కమ్మింగ్ సినిమా జాబితా కూడా భారీగానే ఉంది. ఆమె నటిస్తున్న సినిమాలలో కాక్‌టెయిల్ 2, మైసా, రణబలి, AA22XA6, పుష్ప 3: ది రాంపేజ్ వంటి సినిమా ఉన్నాయి. వీటిలో చాలా సినిమాలు పాన్-ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ అమ్మడు కేవలం సినిమాలకే పరిమితం కాకుండా బ్రాండ్ ప్రమోషన్లు, ప్రకటనలు, డిజిటల్ హక్కులు, ఓటీటీ ఒప్పందాలు వంటి అనేక మార్గాల ద్వారా భారీ ఆదాయాన్ని సంపాదిస్తోంది.

స్టార్ హీరోలు, హీరోయిన్లు కూడా సినిమాల రెమ్యూనరేషన్‌తో పాటు బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, ప్రమోషన్ ఒప్పందాలు, లాభాల్లో వాటాలు ద్వారా కోట్లలో సంపాదిస్తున్నారు. మొత్తంగా చూస్తే, ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోగా అల్లు అర్జున్, హీరోయిన్‌గా రష్మిక మందన్న అగ్రస్థానంలో నిలిచినట్టు రిపోర్ట్స్ చెబుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X