ఎన్టీఆర్ బయోపిక్: ఎన్టీఆర్ కూతురు పురంధరేశ్వరి పాత్రలో ఈవిడేనా?
మాజీ ముఖ్యమంత్రి, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ దివంగత ఎన్టీ రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ 'ఎన్టీఆర్' చిత్రానికి సంబంధించి రోజుకో ఆసక్తికర విషయం వెలుగులోకి వస్తోంది. ఇందులో ఎన్టీఆర్ పాత్రను బాలయ్య పోషిస్తుండగా... ఎన్టీఆర్ సతీమని బసవతారకం పాత్రలో విద్యా బాలన్, చంద్రబాబు నాయుడు పాత్రలో రానా, అక్కినేని పాత్రలో సుమంత్ నటిస్తున్న సంగతి తెలిసిందే.
పలువురు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా ఈ మూవీలో ఉండబోతున్నట్లు చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా పురంధరేశ్వరి పాత్రకు సంబంధించి ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. విజయవాడకు చెందిన హిమాన్సి చౌదరి అనే డ్యాన్సర్ పురంధరేశ్వరి పాత్రలో కనిపించబోతోందని టాక్. పురంధరేశ్వరి, హిమన్సీ కలిసి దిగిన ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ ఫోటో చూసిన అభిమానులు సైతం చిన్నమ్మ పాత్రకు హిమన్సీ పర్ఫెక్టుగా సరిపోతుందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ వార్త నిజమో? కాదో? అఫీషియల్‌గా వెల్లడి కావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శర వేగంగా జరుగుతోంది.
దర్శకుడు క్రిష్ జాగర్లమూడి సినిమాలోని పాత్రలు, లుక్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. బయోపిక్ జనాల్లోకి వెళ్లాంటే అందులోని పాత్రలు నిజ జీవిత పాత్రలకు దగ్గరగా ఉండాలనేది క్రిష్ నమ్మకం. అందుకు తగిన విధంగానే నటీనటుల ఎంపిక చేయడంతో పాటు అద్భుతమైన మేకోవర్‌తో అదరగొడుతున్నారు.
Recommended Video



Click it and Unblock the Notifications











