Akhil ‘ఏజెంట్’కు ఆదిలోనే బిగ్ షాక్: మూవీ నుంచి థమన్ ఔట్.. అతడు ఇన్

అప్పుడెప్పుడో వచ్చిన 'అఖిల్' అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అక్కినేని వారసుడు అఖిల్. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రం ఘోర పరాజయాన్ని చవి చూసింది. ఆ తర్వాత ఈ యంగ్ హీరో 'హలో' అనే మూవీతో రీలాంచ్ అయ్యాడు. కానీ ఇది కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ మధ్య 'మిస్టర్ మజ్నూ' వంటి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో నటించాడు. ఇది కూడా అతడికి విజయాన్ని మాత్రం అందించలేదు. దీంతో సక్సెస్ కోసం ఈ అక్కినేని వారసుడు అఖిల్ మరికొంత కాలం వేచి చూడాల్సిన పరిస్థితి వచ్చింది.

హీరోగా పరిచయమై చాలా కాలమే అవుతోన్న ఒక్కటంటే ఒక్క హిట్‌ను కూడా తన ఖాతాలో వేసుకోలేదు అఖిల్. వరుస పరాజయాలతో సతమతం అవుతోన్న తరుణంలో అతడు.. కొద్ది రోజుల క్రితం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' అనే చిత్రాన్ని చేశాడు. ఈ సినిమాను అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌ బ్యానర్‌పై బన్నీవాస్‌, వాసు వర్మ సంయుక్తంగా నిర్మించారు. పూజా హెగ్డే ఇందులో హీరోయిన్‌గా నటించింది. గోపీ సుందర్ సంగీతం అందించాడు. ఈ సినిమా అక్టోబర్ 8న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ప్రకటించారు.

Hiphop Tamizha Replace S. Thaman for Akhil Akkineni Agent Movie

'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' మూవీ విడుదల కాకముందే అక్కినేని అఖిల్ తన తదుపరి చిత్రాన్ని కూడా మొదలెట్టేశాడు. దీన్ని స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ కూడా మొదలైంది. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్‌లో తీసుకు రావాలని చూస్తున్నారు. ఇందుకోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా షూటింగ్‌ను జరుపుతున్నారు. అలాగే, ఇంటర్నేషనల్ రేంజ్ టెక్నీషియన్లను కూడా వాడబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్ర యూనిట్‌కు భారీ షాక్ తగిలిందట.

భారీ బడ్జెట్‌తో హై రేంజ్‌లో తెరకెక్కుతోన్న 'ఏజెంట్' మూవీ నుంచి మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ తప్పుకున్నాడని ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దీనికి కారణం అతడు చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉండడమేనని సమాచారం. ఇప్పటికే ఎన్నో చిత్రాలను ఒప్పుకున్న థమన్.. అఖిల్ 'ఏజెంట్'కు సరైన సమయం కేటాయించలేకపోతున్నాడట. అందుకే దీని నుంచి తప్పుకున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఇక, అతడి స్థానంలో కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ హిప్‌ఆప్ తమీజాను తీసుకోవాలని చిత్ర యూనిట్ డిసైడ్ అయిందట. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన వెలువడొచ్చని తెలుస్తోంది.

Hiphop Tamizha Replace S. Thaman for Akhil Akkineni Agent Movie

'ఏజెంట్' మూవీని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్, సురేందర్ 2 సినిమా బ్యానర్లపై సుంకర రామబ్రహ్మం, దీపా రెడ్డి, అజయ్ సుంకర నిర్మిస్తున్నారు. ప్రముఖ రచయిత, డైరెక్టర్ వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథను అందిస్తున్నాడు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం సమకూర్చుతున్నాడు. స్పై థ్రిల్లర్‌గా రాబోతున్న 'ఏజెంట్' యాక్షన్ మూవీలో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటిస్తున్నట్లు ఆరంభంలో ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఆయనను కాదని అదే పరిశ్రమకు చెందిన మమ్ముట్టిని తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై చిత్ర యూనిట్ స్పందించాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X