HIT 3: ఇద్దరు హీరోలు.. విలన్ గా మరో అగ్ర నటుడు.. నాని మైండ్ బ్లోయింగ్ ప్లాన్
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇటీవల కాలంలో అగ్ర హీరోలు అలాగే చిన్న హీరోలు అందరూ కూడా మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి ఎంతో ఆసక్తిని చూపిస్తున్నారు. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాలలో అయితే డిఫరెంట్ రోల వస్తే ఇతర హీరోలతో చేయడానికి కూడా మరికొందరు కథానాయకులు రెడీ అంటున్నారు. అయితే రాబోయే రోజుల్లో అలాంటివి భిన్నమైన ప్రాజెక్టులు చాలానే రాబోతున్నాయి.
ఇక నాని ప్రొడక్షన్లో త్వరలోనే హిట్ 3 సినిమా కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హిట్ 2 సెకండ్ కేసు విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. డిసెంబర్ రెండవ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమాలో అడవి శేష్ కథానాయకుడుగా నటించాడు. ఫస్ట్ కేస్ తో బాక్సాఫీస్ వద్ద దర్శకుడు శైలేష్ కొలను మంచి సక్సెస్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు అడవి శేష్ తో అతను ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తాడు అనేది ఆసక్తిగా మారింది.

అయితే హిట్ మూడవ భాగంలో దర్శకుడు ముగ్గురు అగ్ర హీరోలను వెండితెరపై చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే అందులో అడవి శేష్ తో పాటు నాని కూడా మరొక హీరోగా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక మరో ప్రముఖ టాలెంటెడ్ నటుడు విజయ్ సేతుపతి విలన్ పాత్రలో కనిపిస్తాడని మరొక టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే విజయ్ సేతుపతికి పూర్తిస్థాయిలో కథను కూడా చెప్పినట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం హిట్ సెకండ్ కేసు విడుదలకు సిద్ధమవుతోంది. ఆ సినిమా సక్సెస్ అయిన తర్వాత దర్శకుడు పూర్తిస్థాయిలో స్క్రిప్ట్ పనులను పూర్తి చేసి మరొకసారి నటీనటులందరికీ చెప్పబోతున్నాడు. అయితే ఈ సినిమాకు నాని మాత్రమే కాకుండా మరో ప్రముఖ నిర్మాత ప్రొడక్షన్ లో భాగమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక హిట్టు 3 మూడవ కేసును పాన్ ఇండియా రేంజ్ లోనే తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలను క్రియేట్ చేస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











