రామ్ గోపాల్ వర్మ పిచ్చి ప్రేలాపనలకి కౌంటర్ వేసిన రాజమౌళి...
దేవుడ్ని నిలదీసే ధైర్యం మనిషికి ఉందా...? బహుశా ఎవరూ ఈ సాహసాన్ని చేయరు. కాని తన రూటే సెపరేట్ అని చెప్పే వర్మ, ఆ దమ్ము తనకు ఉందని నిరూపించాడు. రాముడు భార్య కోసమే రావణుడితో యుద్ధం చేసాడు కానీ ప్రజలకు కోసం కాదు కదా మరి రాముడు దేవుడు ఎలా అవుతాడని ప్రశ్నించాడు. శ్రీరామ నవమి నాడు అందరూ రాముడిని పూలతో కొలుస్తుంటే మన రామ్ గోపాల్ వర్మ నిందలతో శంకించాడు. అదే విధంగా భార్య కోరిక మేరకు రామున్ని అడవులకి పంపిన దశరధుడు స్వర్గానికి ఎలా వెళతాడని అడిగాడు. లక్ష్మణుడి భార్య ఊర్మిళ సీత లాగా అడవులకు వెల్లనందున ఆమె కూడా నరకానికి వెలుతుందా అని వర్మ తన ట్విటర్ లో పేర్కొన్నాడు.
రాముడి గురించి ఇష్టమొచ్చిన పిచ్చిప్రేలాపనలతో రామ భక్తుల్నే కాకా చాలా మందిని చీకాకు పెట్టిన రామ్ గోపాల్ వర్మకి దర్శకులానికే చెందిన రాజమౌళి గౌరవంగా గడ్డిపెట్టాడు. రామాయణ విషవృక్షం లాంటి అర్థం లేని పుస్తకాన్ని ఫౌంటైన్ హెడ్ తో పోల్చిన వర్మతో 'దేవుడే మిమ్మల్ని కాపాడాలి" అని అర్థం వచ్చేలా రాజమౌళి కౌంటర్ ఇచ్చాడు. దానికి రామ్ గోపాల్ వర్మ ఏదో సమాధానమిచ్చేసి 'ఈగ"చూడాలని తహతహలాడిపోతున్నా అంటూ టాపిక్ డైవర్ట్ చేయబోయాడు. కానీ రాజమౌళి ఆ గిమ్మిక్కులకేమీ పడిపోకుండా రామాయణ విషవృక్షం ఎంత దండగమారి పుస్తకమనేది మళ్లీ చెప్పడు. దాంతో డిఫెన్స్ లో పడ్డ వర్మ మనం డైరెక్టుగా కలిసినప్పుడు దీనిగురించి కూలంకషంగా చర్చించుకుందామంటూ సైడైపోయాడు. గొప్ప దర్శకుడిగా మిగిలిపోవడమెలాగో తెలీక తన జూనియర్లతో కూడా గడ్డి పెట్టించుకునే స్థాయికి వర్మ పడిపోయాడు.


Click it and Unblock the Notifications











