హాలీవుడ్ హీరోయిన్‌తో ప్రభాస్ రొమాన్స్.. ఇది మామూలు ట్విస్టు కాదుగా!

సాధారణంగా ఒక స్టార్ హీరో ఏడాదికి ఒక సినిమా చేయడం అనేది ఇప్పుడు చాలా కష్టంగా మారిపోయింది. అలాంటి పాన్ ఇండియా రేంజ్ హీరోలు మాత్రం కనీసం రెండేళ్లు తీసుకుంటున్నారు. అలాంటి ఒకే ఒక్క స్టార్ మాత్రం చేతిలో నాలుగైదు ప్రాజెక్టులను పెట్టుకుని దూసుకుపోతోన్నాడు. అతడే రెబెల్ స్టార్ ప్రభాస్. చాలా కాలంగా అతగాడు జెట్ స్పీడుతో ముందుకు వెళ్తున్నాడు.

గత ఏడాది చివర్లో 'సలార్: సీజ్‌ఫైర్' మూవీతో వచ్చిన ప్రభాస్.. చాలా కాలం తర్వాత భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ జోష్‌లోనే ఉప్పుడు అతడు 'కల్కి ఏడి 2898' మూవీని చేస్తున్నాడు. ఇది మరికొద్ది రోజుల్లోనే విడుదల కాబోతుంది. అలాగే, ప్రభాస్ దీని తర్వాత 'ది రాజా సాబ్', 'సలార్ 2', 'స్పిరిట్' మూవీలను చేయబోతున్న విషయం తెలిసిందే.

Hollywood Heroine Fix for Prabhas and Hanu Raghavapudi Movie

ఇప్పుడు ప్రకటించిన సినిమాలతో పాటు ప్రభాస్.. 'సీతా రామం' దర్శకుడు హను రాఘవపూడితో కూడా ఓ మూవీ చేయబోతున్నట్లు ఇటీవలే న్యూస్ లీకైన విషయం తెలిసిందే. ఈ మూవీ వరల్డ్ వార్ నేపథ్యంతో సాగే ఓ ప్రేమ కథతో రూపొందనుందని అంటున్నారు. దీంతో ప్రకటించక ముందే ఈ ప్రాజెక్టుపై అందరిలోనూ ఆసక్తి పెరిగిపోయిందనే చెప్పుకోవాలి.

ప్రభాస్ - హను చిత్రానికి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను ఈ ఏడాది డిసెంబర్ నెల నుంచి మొదలు పెట్టబోతున్నారట. అంతకంటే ముందు అంటే ప్రభాస్ పుట్టినరోజైన అక్టోబర్ 23వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందని తెలిసింది. నవంబర్‌లో పూజా కార్యక్రమాలను జరిపేసి.. మొత్తానికి డిసెంబర్‌లో పట్టాలెక్కించబోతున్నారని తెలుస్తోంది.

Hollywood Heroine Fix for Prabhas and Hanu Raghavapudi Movie

క్రేజీ సబ్జెక్టుతో రాబోతున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరిని తీసుకుంటారన్న దానిపై కూడా చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే శ్రీలీల సహా ఎంతో మంది పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఇందులో ప్రభాస్ సరసన హాలీవుడ్ హీరోయిన్ నటిస్తుందట. వరల్డ్ వార్ స్టోరీ కావడంతో ఇంగ్లీష్ పిల్లకే చిత్ర యూనిట్ ప్రధాన్యత ఇస్తుందని టాక్.

ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి తెరకెక్కించబోయే ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్‌ నిర్మించబోతున్నారు. దీన్ని కూడా పాన్ ఇండియా రేంజ్‌లోనే చాలా భాషల్లో రూపొందిస్తారని తెలిసింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X