ప్రభాస్ కోసం మరోసారి హాలీవుడ్ టెక్నీషియన్స్.. ఈ దర్శకుడైనా న్యాయం చేయగలడా?
బాహుబలి సినిమా అనంతరం సాహో సినిమాతో ఊహించని రిజల్ట్ అందుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ నెక్స్ట్ సినిమాతో అయినా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే రాధాకృష్ణ ప్రాజెక్టును సగానికి పైగా పూర్తి చేసిన ప్రభాస్ ఆ సినిమాతో పాటు తన 21వ సినిమాను కూడా వీలైనంత త్వరగా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాడు. మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందనున్న ఆ సినిమాను దాదాపు రూ.500కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే సాహో కోసం ఉపయోగించినట్లుగానే ప్రభాస్ 21 యాక్షన్ సీన్స్ కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ ని సెలెక్ట్ చేసుకొనున్నారట. వైజయంతి మూవీస్ లాంటి బడా ప్రొడక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా కావడం.. అలాగే అందులో ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా కావడంతో అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అందుకే ఖర్చుకు వెనుకాడకుండా నిర్మాత అశ్విన్ దత్ హాలీవుడ్ టెక్నీషియన్స్ ని దింపుతున్నారట.

దర్శకుడు నాగ్ అశ్విన్ మహానటి సినిమాతో పాటు అంతకుముందు ఎవడే సుబ్రహ్మణ్యం అనే సింపుల్ సినిమాను డైరెక్ట్ చేశాడు. ఇంతవరకు యాక్షన్ సీన్స్ ని టచ్ చేసింది లేదు. అశ్విన్ పని చేసింది కూడా డైరెక్టర్ శేఖర్ కమ్ముల వద్ద. దీంతో యాక్షన్ ని టచ్ చేయని నాగ్ అశ్విన్ అభిమానుల అంచనాలను ఏ విధంగా అందుకుంటాడు అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. కానీ దర్శకుడు చెప్పిన కథకు హాలీవుడ్ టెక్నీషియన్స్ అయితేనే సరైన న్యాయం చేయగలరని నిర్మాత భారీ బడ్జెట్ ని కేటాయించినట్లు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











