అఖిల్ కోసం హాలీవుడ్ టచ్.. సురేందర్ రెడ్డి VFX ప్రయోగాలు
అక్కినేని యువ హీరో అఖిల్ మొదటి సక్సెస్ కోసం చేసిన మూడు సినిమాలు చాలా వరకు నిరాశపరిచాయి. ఎలాగైనా సక్సెస్ అంసుకోవాలని నెక్స్ట్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో రెడీ అవుతున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా సురేందర్ రెడ్డితో కూడా అఖిల్ ఎదో కొత్త ప్రయోగమే చేస్తున్నాడని అనిపిస్తోంది. ఇటీవల వీరి కాంబినేషన్ పై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఈ రోజుల్లో చాలా వరకు పెద్ద సినిమాలకు VFX వర్క్ తప్పనిసరిగా మారింది. ఇక దర్శకుడు సురేందర్ రెడ్డి ఆల్ రెడీ సైరా సినిమా ద్వారా వాటి విలువను తెలుసుకున్నాడు. ఆ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాకపోయినప్పటికి కొన్నిచోట్ల విజువల్ ఎఫెక్ట్స్ చాలా వరకు క్లిక్కయ్యాయి. దీంతో నెక్స్ట్ సినిమాకు కూడా సురేందర్ రెడ్డి సైరా సినిమాకు పని చేసిన VFX టెక్నీషియన్స్ ని సెట్ చేసుకోబోతున్నాడట.

హాలీవుడ్ రేంజ్ లో యాక్షన్ స్టంట్స్ ఉంటాయని తెలుస్తోంది. అఖిల్ మొదటి రెండు సినిమాల్లో యాక్షన్ సీన్స్ తో బాగానే ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు కిక్ దర్శకుడి కోసం ఫిట్నెస్ లో కొన్ని మార్పులు చేయబోతున్నాడు. బాడీని కూడా గట్టిగానే పెంచుతున్నాడు.
అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఆ సినిమాను రూపొందించాలని దర్శకుడు బాగానే ప్లాన్ చేసుకుంటున్నాడు. కానీ అఖిల్ పై 40కోట్ల బడ్జెట్ అంటేనే రిస్క్ తో కూడుకున్న పని ఇక హై లెవెల్లో హాలీవుడ్ యాక్షన్ సీన్స్ అంటే బడ్జెట్ కోటలు దాటడం కాయం. మరి చిత్ర నిర్మాతలు ఎంతవరకు ధైర్యం చేస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











