Mahesh Babuతో కేజీఎఫ్ నిర్మాత మూవీ.. ఆ స్క్రిప్ట్ కోసం వేట.. ఒకవేళ దొరికితే ఇక రచ్చే!
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కేజిఎఫ్ ఫీవర్ నెలకొంది. హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజిఎఫ్ సీక్వెల్ కేజిఎఫ్ 2 ఏప్రిల్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. అయితే ఇప్పుడు ఈ సినిమాను నిర్మించిన నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ మహేష్ బాబుతో ఒక సినిమా చేయడానికి ప్రయత్నిస్తోందనే ప్రచారం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

హోంబలే ఫిలింస్
2012వ సంవత్సరంలో విజయ్ కిరగందూర్ హోంబలే ఫిలింస్ అనే ఒక నిర్మాణ సంస్థను స్థాపించారు. ఈ నిర్మాణ సంస్థ కేజీఎఫ్ సినిమా చేయడానికి ముందే మూడు సినిమాల నిర్మించింది. నిన్నిడాలే, మాస్టర్ పీస్, రాజకుమార అనే మూడు సినిమాలు ఈ సంస్థ ద్వారా నిర్మించారు. మొదటి సినిమాకు తెలుగులో కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించిన జయంత్ సి పరాన్జీ దర్శకత్వం వహించగా పునీత్ రాజ్ కుమార్ హీరోగా నటించారు.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో
ఆ తర్వాత మాస్టర్ పీస్ అనే సినిమాని మంజు మాండవ్య దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కించారు. ఆ తర్వాత పునీత్ రాజ్ కుమార్ హీరోగా సంతోష్ రాజకుమార అనే సినిమా కూడా తెరకెక్కించారు. ఈ సినిమాలు అన్నీ కేవలం కన్నడ సినీ పరిశ్రమ వరకే పరిమితం అయ్యాయి కానీ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కిన కేజిఎఫ్ చాప్టర్ వన్ మాత్రం కన్నడ సినీ పరిశ్రమ సత్తాని దేశవ్యాప్తంగా చాటి చెప్పింది.

మహేష్ బాబుతో సినిమా
ఈ దెబ్బతోనే కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమాని కూడా వాళ్లు నిర్మించారు. అయితే ఈ నిర్మాణ సంస్థ టాలీవుడ్ టాప్ స్టార్ మహేష్ బాబు తో ఒక సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తుందనే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సదరు నిర్మాణ సంస్థ మహేష్ బాబుతో సినిమా చేయాలని ఆసక్తిగా ఉందని ప్రస్తుతం ఒక అద్భుతమైన స్క్రిప్ట్ కోసం ఎదురు చూస్తోందని తాజాగా వెల్లడైంది.

డైరెక్టర్ ఎవరు?
ఆ స్క్రిప్ట్ ఎలా ఉండాలంటే ఫన్ ఎలిమెంట్స్ తో కూడిన పూర్తి ఫ్యామిలీ సబ్జెక్ట్ లేదా సందేశంతో కూడిన ఒక అద్భుతమైన ఊర మాస్ సబ్జెక్ట్ కోసం సినిమా నిర్మాణ సంస్థ ఎదురుచూస్తూ ఉందని తెలుస్తోంది. ప్రస్తుతానికి డైరెక్టర్ ఎవరు అనేది ఫైనల్ కాలేదు కానీ ఒక్కసారి స్క్రిప్ట్ బ్లాక్ అయిన తర్వాత డైరెక్టర్ ఎవరు అనే దాని మీద దృష్టి పెడతారని తెలుస్తోంది.

మహేష్ బాబు లైనప్ కూడా గట్టిగానే
లేదా ఎవరైనా దర్శకుడు ఈ విధంగా కథలు రెడీ చేసుకొని వచ్చేస్తే వినడానికి కూడా నిర్మాత సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ నిర్మాణ సంస్థ నిర్మనలోనే ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సలార్ సినిమా నిర్మితమవుతోంది. అలా తెలుగు మార్కెట్ లో కూడా వీళ్ళు అడుగుపెడుతున్నారు కాబట్టి మహేష్ బాబుతో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈ విషయం ఎంత వరకు వెళుతుంది అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే మహేష్ బాబు లైనప్ కూడా గట్టిగానే ఉంది.


Click it and Unblock the Notifications











