NBK109: టక్కరి దొంగలా మారిన బాలయ్య.. థియేటర్లు దద్దరిల్లే సీన్ లీక్

టాలీవుడ్‌లో చాలా తక్కువ మంది హీరోలు మాత్రమే వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ ఫుల్ ఫామ్‌తో దూసుకుపోతోన్నారు. అలాంటి వారిలో నటసింహా నందమూరి బాలకృష్ణ ఒకరు. 'అఖండ' హిట్ ట్రాక్ ఎక్కిన ఆయన.. అప్పటి నుంచి వరుసగా 'వీర సింహా రెడ్డి', 'భగవంత్ కేసరి'తో సక్సెస్‌లు సాధించారు. ఈ ఉత్సాహంలోనే ఇప్పుడు వరుసగా మూవీలు చేస్తున్నారు.

వరుస హిట్లతో దూసుకుపోతోన్న నందమూరి బాలకృష్ణ ఇప్పుడు కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీతో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం 1980వ నాటి దశకం కథతో రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, ఇటీవల వచ్చిన గ్లింప్స్‌లో బాలయ్య దిమ్మతిరిగే లుక్‌తో కనిపించారు. దీంతో దీనిపై అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే ఈ మూవీని తీస్తున్నారు.

Horse Riding Fight Highlight In Balakrishna and Bobby Movie

బాలయ్య - బాబీ కాంబినేషన్‌లో హై రేంజ్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను గత ఏడాదిలోనే మొదలు పెట్టారు. అప్పటి నుంచి ఏమాత్రం బ్రేకులు లేకుండా షూటింగ్ జరుపుతున్నారు. ఇలా ఇప్పటికే 90 శాతానికి పైగానే టాకీ పార్టును పూర్తి చేసుకున్నారు. మిగిలిన దాన్ని కూడా వీలైనంత త్వరగానే కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

క్రేజీ కాన్సెప్పుతో రూపొందుతోన్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ చాలా వరకూ పూర్తవడంతో ఈ సినిమాలోకి ఎన్నో అంశాలు బయటకు వచ్చేశాయి. ముఖ్యంగా ఇందులో ఫలానా ఎపిసోడ్ అద్భుతంగా ఉంటుందని, కొన్ని సీక్వెన్స్‌లు అదిరిపోతాయని ఎన్నో రకాల విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ దిమ్మతిరిగే న్యూస్ బయటకు వచ్చింది.

Horse Riding Fight Highlight In Balakrishna and Bobby Movie

హై ఓల్టేజ్ యాక్షన్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో టక్కరి దొంగ రేంజ్ సీక్వెన్స్ ఒకటి హైలైట్‌గా ఉండబోతుందని తాజాగా ఓ వార్త హల్చల్ చేస్తోంది. ఇందులో బాలయ్య గుర్రం మీద వచ్చి విలన్ గ్యాంగ్‌ బెండ్ తీస్తారట. బీచ్‌లో ప్లాన్ చేసిన ఈ యాక్షన్ ఎపిసోడ్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించేలా ఉంటుందని సమాచారం. దీంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అవుతున్నాయి.

ఇదిలా ఉండగా.. బాలయ్య హీరోగా బాబీ తీస్తున్న ఈ సినిమాను సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై సాయి సౌజన్య, నాగ వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో బాబీ డియోల్, ఊర్వశీ రౌటేలా నటిస్తున్నారు. థమన్ దీనికి సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ ఈ ఏడాది చివర్లో వచ్చే ఛాన్స్ ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X